Zomato Pure Veg Fleet: ఆన్‌లైన్‌లో శాకాకాహారం ఆర్డర్ చేసే వారికి గుడ్ న్యూస్, ప్యూర్ వెజ్ మోడ్, ప్యూజ్ వెజ్ ఫ్లీట్ సేవలను ప్రారంభించిన జొమాటో
జొమాటో వ్యవస్ధాపకులు, సీఈవో దీపీందర్ గోయల్ ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్‌లో ఈ మేరకు ప్రకటించారు.దేశంలో శాకాహారుల నుంచి స్వీకరించిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా తాము ఈ సర్వీస్‌ను లాంచ్ చేశామని గోయల్ వెల్లడించారు
పూర్తి శాకాకాహార పదార్ధాలను కోరుకునే వారి కోసం ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో ప్యూర్ వెజ్ మోడ్, ప్యూజ్ వెజ్ ఫ్లీట్ సేవలను లాంఛ్ చేసింది. జొమాటో వ్యవస్ధాపకులు, సీఈవో దీపీందర్ గోయల్ ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్‌లో ఈ మేరకు ప్రకటించారు.దేశంలో శాకాహారుల నుంచి స్వీకరించిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా తాము ఈ సర్వీస్‌ను లాంచ్ చేశామని గోయల్ వెల్లడించారు. ప్యూర్ వెజ్ మోడ్‌లో ప్రస్తావించే రెస్టారెంట్లు కేవలం వెజిటేరియన్ ఫుడ్‌ను మాత్రమే వండి, సర్వ్ చేస్తాయని ఆయన పేర్కొన్నారు. నాన్-వెజ్ ఆహారాలను సర్వ్ చేసే రెస్టారెంట్లు ఈ జాబితాలో ఉండవని ఎక్స్ పోస్ట్‌లో గోయల్ స్పష్టం చేశారు.అయితే నూతన సర్వీస్ ఏ మతానికి, రాజకీయ ప్రాధాన్యతలకు వ్యతిరేకం కాదని పేర్కొన్నారు.
Here's Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)