Chicago Shooting: అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. చికాగోలో దుండగుడు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది మృతి
చికాగోలోని (Chicago) జోలియెట్ పట్టణంలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో (Shooting) ఎనిమిది మంది మరణించారు.
Chicago, Jan 23: కాల్పులతో అమెరికా (USA) మరోసారి ఉలిక్కిపడింది. చికాగోలోని (Chicago) జోలియెట్ పట్టణంలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో (Shooting) ఎనిమిది మంది మరణించారు. ఆది, సోమవారాల్లో రెండు వేర్వేరు ఇళ్లలో సాయుధుడు కాల్పులకు తెగబడ్డాడని అధికారులు తెలిపారు. నిందితుడిని రోమియో నాన్స్ గా (Romeo Nance) గుర్తించామన్నారు. మరణించిన వారితో అతడికి ముందే పరిచయం ఉన్నట్లు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. మృతుల్లో ఒకరిని ఆదివారం చంపినట్లు, మిగిలిన ఏడుగురిని సోమవారం హత్యచేసినట్లు నిర్ధారించారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)