Air India Cancels All Flights to Israel: పశ్చిమాసియాలో తీవ్రమైన ఉద్రిక్తతలు, ఇజ్రాయెల్‌కు ఎయిర్‌ఇండియా విమాన సర్వీసులు బంద్‌

ఇజ్రాయెల్‌కు తాత్కాలికంగా విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు వెల్ల‌డించింది.

Air India suspends flights to Tel Aviv until August 8 amid Israel-Iran tensions

పశ్చిమాసియాలో రోజురోజుకూ ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతుండటంతో భారత విమానయాన సంస్థ ఎయిరిండియా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇజ్రాయెల్‌కు తాత్కాలికంగా విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు వెల్ల‌డించింది. నేటి నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు టెల్‌అవీవ్‌ నుంచి భారత్‌కు వచ్చే విమానాలను, ఇక్కడ నుంచి అక్కడకు వెళ్లే విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు సంస్థ‌ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ వైమానికి దాడిలో హిజ్బుల్లా టాప్ మిలటరీ కమాండర్ ఫౌద్ షోకోర్ మృతి, అధికారికంగా ధ్రువీకరించిన హెజ్‌బొల్లా గ్రూపు

అలాగే పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి సర్వీసుల పునరుద్ధరణపై త‌గిన‌ నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. కాగా, ఆగస్టు 8వ తేదీ వరకు ఢిల్లీ-టెల్‌ అవీవ్‌ మధ్య ప్రయాణాల కోసం ఇప్పటికే టికెట్లు బుక్‌ చేసుకున్న ప్రయాణికులకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. టికెట్ల రద్దు, రీషెడ్యూలింగ్ పై ఒకసారి ఛార్జీల మినహాయింపు ఇస్తామని పేర్కొంది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతకు ప్రాధాన్యమిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

Here's ANI Tweet