Galwan Valley: బరితెగించిన చైనా, గాల్వన్ లోయ మాదేనంటూ జాతీయపతాకం ఎగరవేసింది, దీనికి వెంటనే బదులివ్వాలంటూ ప్రధాని మోదీపై విరుచుకుపడిన ప్రతిపక్షాలు

గాల్వన్ లోయలో జనవరి 1 తేదీన డ్రాగన్ కంట్రీ గాల్వన్ లోయలో తమ దేశపు జాతీయ జెండాను ఎగురవేసిందని చైనా అధికారిక పత్రికలో కథనాలు వచ్చాయి. భారత సరిహద్దులోని గాల్వన్ లోయలో ఇంచు భూమి కూడా విడిచిపెట్టమంటూ వీడియోను ట్వీట్ చేసింది.

Flag of China (photo Credits: PTI)

సరిహద్దుల్లో చైనా మరోసారి బరితెగించింది. గాల్వన్ లోయలో జనవరి 1 తేదీన డ్రాగన్ కంట్రీ గాల్వన్ లోయలో తమ దేశపు జాతీయ జెండాను ఎగురవేసిందని చైనా అధికారిక పత్రికలో కథనాలు వచ్చాయి. భారత సరిహద్దులోని గాల్వన్ లోయలో ఇంచు భూమి కూడా విడిచిపెట్టమంటూ వీడియోను ట్వీట్ చేసింది. 2022 నూతన సంవత్సరం తొలి రోజున గాల్వన్ లోయలో చైనా జాతీయ జెండాను ఎగురవేసిందని ఈ జాతీయ జెండా ఒకప్పుడు బీజింగ్ లోని తియాన్ స్వేర్ పై ఎగిరింది కాబట్టి ఇది చాలా ప్రత్యేకమైందని చైనా అధికార మీడియా ప్రతినిధి షెన్ షివి ట్వీట్ చేశారు. దీనిపై ప్రధాని మోదీ సర్కారుపై ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి.

చైనాకు ఈ విషయం మీద ధీటుగా బదులివ్వాలని ప్రధాని వెంటనే మౌనం వీడాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. దేశ విజయం కోసం ఒట్టిమాటలు కట్టిపెట్టి తెలివైన, కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని రాహుల్ కోరారు.

ఇదిలా ఉంటే చైనా సైన్యం జెండా ఎగుర వేసిన ప్రదేశం వివాదాస్పద ప్రాంతం కాదని ఆర్మీ వర్గాలు స్పష్టత ఇచ్చాయి. చైనా అధీనంలోని ప్రదేశంలోనే పతాకావిష్కరణ జరిగిందని భారత సైన్యం తెలిపింది.



సంబంధిత వార్తలు

Siva Prasad Reddy Slams Chandrababu Govt: ఎంత మందిపై కేసులు పెడతారో పెట్టుకోండి, మా పోరాటం ఆగదని తెలిపిన వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి

Harish Rao: పీడిత వర్గాలకు అండదండగా ఉంటాం.. ఉద్యమాలు , అరెస్టులు కొత్త కాదు అని తేల్చిచెప్పిన హరీశ్‌ రావు, నరేందర్ రెడ్డి నిర్దోషిగా బయటకు వస్తారని స్పష్టం చేసిన మాజీ మంత్రి

Anitha Slams YS Jagan: రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ అయితే ప్రతిపక్ష హోదా ఇచ్చినా జగన్ అసెంబ్లీకి రారు, సంచలన వ్యాఖ్యలు చేసిన హోం మంత్రి అనిత, వీడియో ఇదిగో..

India New T20 World Record: టీ20లో టీమిండియా సరికొత్త రికార్డు, అయితే పాకిస్తాన్ టాప్‌లో, దక్షిణాఫ్రికాపై 11 పరుగుల తేడాతో మూడో టీ20లో భారత్ ఘన విజయం