Dev Shah: అమెరికా స్పెల్లింగ్ బీ పోటీల్లో విజేతగా దేవ్‌షా, 50 వేల డాలర్ల ప్రైజ్‌ మనీని గెలుచుకొన్న భారత సంతతి కుర్రాడు

అతడు శామాఫైల్‌ (psammophile) అనే పదానికి స్పెల్లింగ్‌ చెప్పి 50 వేల డాలర్ల ప్రైజ్‌ మనీని గెలుచుకొన్నాడు. శామాఫైల్‌ అంటే ఇసుక నేలల్లో కనిపించే కనిపించే జీవి లేదా మొక్క అని అర్థం

Dev Shah (Photo Credits: Twitter/@ScrippsBee)

అమెరికాలో నిర్వహించిన 95వ నేషనల్‌ స్పెల్లింగ్‌ బీ (US Spelling Bee) పోటీల్లో భారత సంతతికి చెందిన 14 ఏళ్ల దేవ్‌షా విజేతగా నిలిచాడు. అతడు శామాఫైల్‌ (psammophile) అనే పదానికి స్పెల్లింగ్‌ చెప్పి 50 వేల డాలర్ల ప్రైజ్‌ మనీని గెలుచుకొన్నాడు. శామాఫైల్‌ అంటే ఇసుక నేలల్లో కనిపించే కనిపించే జీవి లేదా మొక్క అని అర్థం.ఈ పోటీల అనంతరం ట్రోఫీని అందుకొన్న తర్వాత దేవ్‌ మాట్లాడుతూ ‘‘ఇది నమ్మలేకపోతున్నాను.. ఇప్పటికీ నా కాళ్లు వణుకుతున్నాయి’’ అని పేర్కొన్నాడు.గతంలో కూడా దేవ్‌ స్పెల్లింగ్‌ బీ పోటీల్లో పాల్గొన్నాడు. 2019లో 51వ స్థానంలో.. 2021లో 76వ స్థానంతో సరిపెట్టుకొన్నాడు. ఈ సారి మాత్రం పోటీల్లో విజేతగా నిలిచి తన కలను నెరవేర్చుకొన్నాడు.

Video