Hamas Rocket Attacks: ఇజ్రాయెల్ పై హమాస్ రాకెట్ల వర్షం.. డజన్ల కొద్దీ మృతి.. జనవరి తర్వాత ఇదే తొలిసారి
చాలా రోజుల తర్వాత గాజా భూభాగం నుంచి హమాస్ బలగాలు రాకెట్ల వర్షం కురిపించడంతో టెల్ అవివ్ నగరంలో ఎయిర్ రైడ్ సైరన్లు వినిపించాయి.
Newdelhi, May 27: హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ (Israel) పై రాకెట్ దాడులతో (Hamas Rocket Attacks) విరుచుకుపడ్డారు. చాలా రోజుల తర్వాత గాజా భూభాగం నుంచి హమాస్ బలగాలు రాకెట్ల వర్షం కురిపించడంతో టెల్ అవివ్ నగరంలో ఎయిర్ రైడ్ సైరన్లు వినిపించాయి. ఈ ఏడాది జనవరి తర్వాత హమాస్ దీర్ఘశ్రేణి రాకెట్ దాడులు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. తాజా దాడుల ఘటనలో డజన్ల మంది మరణించినట్టు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. హమాస్ రాకెట్ దాడులపై ఇజ్రాయెల్ సైన్యం స్పందించింది. రఫా ప్రయోగించిన రాకెట్లు ఇజ్రాయెల్ భూభాగంలోకి వచ్చాయని, వాటిని అడ్డుకొన్నామని పేర్కొన్నది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)