Hardeep Singh Nijjar Killing: ఖలిస్థాన్ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు, కెనడాకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చిన భారత్, ఐదు రోజుల్లో దేశాన్ని విడిచి వెళ్లిపోవాలని కెనడా దౌత్యాధికారి సమన్లు

భారత ప్రభుత్వం ఈ ఆరోపణలు నిరాధారమైనవని ఖండించింది. కెనడా ప్రధాని ఈ ప్రకటన చేసిన కొద్దిసేపటికే భారత దౌత్యాధికారిని బహిష్కరిస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి మెలానీ జోలీ ప్రకటించారు. దీనికి బదులుగా భారత్ కూడా కెనడాకు అంతే దీటుగా స్పందించింది.

Khalistani Terrorist Hardeep Singh Nijjar (Image Credits: X/@AdityaRajKaul)

ఇటీవల తమ దేశంలో జరిగిన ఖలిస్తానీ (Khalistan) ఉగ్రవాది హత్యలో భారత్‌ పాత్ర ఉందంటూ కెనడా (Canada) ప్రధాని జస్టిన్‌ ట్రుడో (PM Justin Trudeau) ఆరోపించారు. ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ను (Hardeep Singh Nijjar) చంపిన కేసులో భారతీయ ఏజెంట్లకు (Indian Agents) సంబంధం ఉందని తమ ప్రభుత్వం వద్ద విశ్వసనీయ సమాచారం ఉందని చెప్పారు.

భారత ప్రభుత్వం ఈ ఆరోపణలు నిరాధారమైనవని ఖండించింది. కెనడా ప్రధాని ఈ ప్రకటన చేసిన కొద్దిసేపటికే భారత దౌత్యాధికారిని బహిష్కరిస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి మెలానీ జోలీ ప్రకటించారు. దీనికి బదులుగా భారత్ కూడా కెనడాకు అంతే దీటుగా స్పందించింది. మన అంతర్గత వ్యవహారాల్లో కెనడా దౌత్యవేత్తల జోక్యం చేసుకోకడమే కాకుండా భారత వ్యతిరేక చర్యలకు పాల్పడిన నేరానికి భారత్‌లోని కెనడా దౌత్యాధికారిని వెంటనే బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది భారత విదేశాంగ శాఖ. భారత్‌కు కెనడా హైకమిషనర్‌ అయిన కామెరూన్‌ మెక్‌కేను ఐదు రోజుల్లో దేశాన్ని విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశిస్తూ సమన్లు జారీ చేసింది

Here' s Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now