Nancy Crampton Brophy: భర్తను ఎలా చంపాలో పుస్తకం రాసింది, ఆ తరువాత తన భర్తను తుపాకీతో కాల్చిచంపింది, నాన్సీకి జీవిత ఖైదు విధించిన న్యాయస్థానం
ఆ తరువాత తన భర్తను తుపాకీతో కాల్చిచంపింది. దీంతో ఓరెగాన్ జడ్జి ఆమెకు జీవిత ఖైదు విధించారు.
నీ భర్తను ఎలా చంపాలి అంటూ గతంలో బ్లాగు రాసిన అమెరికా రచయిత్రి నాన్సీ క్రాంప్టన్ బ్రోఫీ.. ఆ తరువాత తన భర్తను తుపాకీతో కాల్చిచంపింది. దీంతో ఓరెగాన్ జడ్జి ఆమెకు జీవిత ఖైదు విధించారు. కేసు వివరాల్లోకి వెళితే.. నాన్సీ క్రాంప్టన్ బ్రోఫీ, డేనియల్ బ్రోఫీ దంపతులకు విపరీతమైన అప్పులు ఉన్నాయి. దీంతో భర్తను చంపితే ఆయన పేరున ఉన్న 1.5 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.11 కోట్లు) బీమా సొమ్ము వస్తుందని ఆమె ఆశపడింది. 2018 జూన్‌లో భర్త ఉద్యోగానికి వెళ్లగా ఆయన వెనకాలే ఓ వాహనంలో ఈమె కూడా వెళ్లింది. పని ప్రదేశంలో భర్త నీటి సింక్ వద్ద ఉండగా నాన్సీ వెనుక నుంచి కాల్చింది. ఆయన కుప్పకూలగా దగ్గరికి వెళ్లి మళ్లీ కాల్చింది. దీంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం నాన్సీకి జీవిత ఖైదు విధించింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)