Newyork Fire Accident: అమెరికాలో అగ్నిప్రమాదం.. ఈబైక్ బ్యాటరీ కారణంగా అపార్ట్ మెంట్ లో మొదలైన మంటలు.. భారతీయ యువకుడి దుర్మరణం.. ఘటనలో మొత్తం 17 మంది గాయపడ్డట్టు అధికారుల వెల్లడి
అమెరికాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భారతీయ యువకుడు ఫజిల్ ఖాన్ (27) దుర్మరణం చెందాడు.
Newyork, Feb 25: అమెరికాలో (America) ఘోర అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. ఈ ఘటనలో భారతీయ యువకుడు ఫజిల్ ఖాన్ (27) దుర్మరణం చెందాడు. హార్లెమ్ ప్రాంతంలోని ఆరంతస్తుల అపార్ట్ మెంట్ లో ఈ ప్రమాదం జరిగింది. ఈ-బైక్ బ్యాటరీ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు అక్కడి అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. భవనంలో చిక్కుకుపోయిన ఫజిల్ ఖాన్ ను అగ్నిమాపక సిబ్బంది ఆసుపత్రికి తరలించగా అతడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనలో మొత్తం 17 మంది గాయపడ్డట్టు అధికారులు పేర్కొన్నారు. న్యూఢిల్లీకి చెందిన ఫజిల్ ఖాన్ కొలంబియా జర్నలిజం కాలేజ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఘటనపై భారతీయ ఎంబసీ విచారం వ్యక్తం చేసింది.
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
SLBC Tunnel Rescue Update: ఎస్ఎల్బీసీ సొరంగంలో ఆపరేటర్ మృతదేహం గుర్తింపు,మిగిలిన ఆరుగురికోసం గాలింపు
Advertisement
Advertisement
Advertisement