Japan Earthquake: జపాన్ భూకంపంలో 78కి పెరిగిన మృతుల సంఖ్య, ఇంకా ఎంతోమంది శిథిలాల కిందనే, యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్న సహాయక చర్యలు

కొత్త ఏడాది రోజునే భారీ భూకంపం బారిన పడిన జపాన్‌లో సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఇషికావా ప్రిఫెక్చర్‌లో సోమవారం రిక్టర్‌ స్కేల్‌పై 7.6 తీవ్రతతో వచ్చిన భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య బుధవారానికి 78కు పెరిగింది.

Earthquake in Japan (Photo Credit: X/ @ANI)

కొత్త ఏడాది రోజునే భారీ భూకంపం బారిన పడిన జపాన్‌లో సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఇషికావా ప్రిఫెక్చర్‌లో సోమవారం రిక్టర్‌ స్కేల్‌పై 7.6 తీవ్రతతో వచ్చిన భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య బుధవారానికి 78కు పెరిగింది.కాగా చలి విపరీతంగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోందని ప్రధాని ఫుమియో కిషిదా బుధవారం చెప్పారు.

సగం కూలిన భవనాల కింద ఇంకా చాలా మంది చిక్కుకుని ఉన్నారని సహాయక సిబ్బంది అంచనావేశారు. రాత్రంతా కేవలం నాలుగు డిగ్రీ సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఉండటంతో చలిలో శిథిలాల వద్ద అన్వేషణ, గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది. గాయపడిన 300 మందిని ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నారు. 33,000 మందిని సహాయక శిబిరాలకు తరలించారు.

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement