Philadelphia Mass Shooting: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం, నలుగురు మృతి, మరో నలుగురికి తీవ్ర గాయాలు
ఫిలడెల్ఫియాలోని కింగ్‌సెసింగ్ పొరుగున ఉన్న వారింగ్టన్ అవెన్యూలోగల 5700 బ్లాక్‌లో సోమవారం రాత్రి జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం చోటు చేసుకుంది. ఫిలడెల్ఫియాలోని కింగ్‌సెసింగ్ పొరుగున ఉన్న వారింగ్టన్ అవెన్యూలోగల 5700 బ్లాక్‌లో సోమవారం రాత్రి జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. కాల్పుల్లో గాయపడిన వారిని పెన్ ప్రెస్బిటేరియన్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతున్నది. కాగా, కాల్పులు జరిగిన కొద్దిసేపటికే ఫ్రేజియర్ స్ట్రీట్ 1800 బ్లాక్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు.
Here's PTI Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)