Robert Fico Health Update: స్లొవేకియా ప్రధాన‌మంత్రి రాబ‌ర్ట్ ఫికోపై దుండగులు పలుమార్లు కాల్పులు, పొట్ట‌, త‌ల భాగంలో తీవ్ర గాయాలు

దుండ‌గుడి కాల్పుల్లో స్లొవేకియా ప్రధాన‌మంత్రి రాబ‌ర్ట్ ఫికో తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. హాండ్లోవాలో మంత్రిమండ‌లి స‌మావేశంలో పాల్గొని తిరిగివ‌స్తున్న స‌మ‌యంలో ప్ర‌ధానిపై ఓ దుండ‌గుడు కాల్పుల‌కు పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ప‌లుమార్లు కాల్పులు జ‌ర‌ప‌డంతో ప్ర‌ధానికి పొట్ట‌, త‌ల భాగంలో గాయాల‌య్యాయి

Robert Fico

దుండ‌గుడి కాల్పుల్లో స్లొవేకియా ప్రధాన‌మంత్రి రాబ‌ర్ట్ ఫికో తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. హాండ్లోవాలో మంత్రిమండ‌లి స‌మావేశంలో పాల్గొని తిరిగివ‌స్తున్న స‌మ‌యంలో ప్ర‌ధానిపై ఓ దుండ‌గుడు కాల్పుల‌కు పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ప‌లుమార్లు కాల్పులు జ‌ర‌ప‌డంతో ప్ర‌ధానికి పొట్ట‌, త‌ల భాగంలో గాయాల‌య్యాయి. దీంతో వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన భ‌ద్రతా సిబ్బంది ఆయ‌న‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం ఆసుప‌త్రిలో ఉన్న ఆయ‌న ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ ఘ‌ట‌న‌ను ఆ దేశ అధ్య‌క్షుడు జుజానా కాపుటోవా ఖండించారు. ప్ర‌ధాని ఫికో త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు. మ‌రోవైపు పోలీసులు కాల్పులు జ‌రిపిన నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement