Russia-Ukraine Conflict: ఉక్రెయిన్‌ సైన్యం పోరాటం ఆపితే చర్చలకు సిద్ధమని రష్యా కీలక ప్రకటన, ఉక్రెయిన్‌ ఆర్మీ ఆయుధాల్ని వదలి లొంగిపోవాలని తెలిపిన రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్‌

Russian and Ukraine flags (Photo Credits: Pxhere/Pixabay)

ఉక్రెయిన్‌ పరిణామాలపై రష్యా విదేశాంగ మంత్రి కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌ సైన్యం గనుక పోరాటం ఆపితే చర్చలకు సిద్ధమని ప్రకటించారు. ఉక్రెయిన్‌ ఆర్మీ ఆయుధాల్ని వదలి లొంగిపోవాలని, అప్పుడే చర్చలు ముందుకెళ్తాయని ఆ ప్రకటనలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్‌ వెల్లడించారు. ఉక్రెయిన్‌ను నియో-నాజీల తరహాలో పాలించడం మాస్కోకు సైతం ఇష్టం లేదని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాలపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

రష్యా ప్రకటనతో ఉక్రెయిన్‌ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది.  రష్యాతో చర్చలకు సిద్ధమంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ ప్రకటించారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement