Germany Shooting: జర్మనీలో కాల్పుల కలకలం.. ఏడుగురి మృతి.. పలువురికి తీవ్ర గాయాలు.. అత్యంత భయానక ఘటన అని పోలీసుల వెల్లడి

ఇటీవల కాలంలో జర్మనీలో పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా ఆ దేశంలో జరిగిన కాల్పుల ఘటన ఆందోళన కలిగిస్తోంది.

Credits: Twitter

Berlin, March 10: ఇటీవల కాలంలో జర్మనీలో (Germany) పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా ఆ దేశంలో జరిగిన కాల్పుల (Shooting) ఘటన ఆందోళన కలిగిస్తోంది. హాంబర్గ్ నగరంలోని జెహోవాస్ విట్నెస్ సెంటర్ అనే చర్చ్‌ లో జరిగిన కాల్పుల్లో ఏకంగా ఏడుగురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. గురువారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుల సంఖ్యపై పోలీసులు ఇంకా అధికారికంగా స్పందించలేదు. అయితే, ఇదో అత్యంత భయానక ఘటన అని వెల్లడించారు. ఈ కాల్పులు నిందితుడు కూడా మరణించినట్టు సమాచారం.

హెచ్3ఎన్2 వైరస్ అంటే ఏంటి? అది సోకకుండా ఉండేందుకు ఏం చేయాలి?

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now