Shinzo Abe Shot: జపాన్ ప్రధానిని కాల్చిన వీడియో ఇదే, వెనక నుంచి హోమ్‌మేడ్ ఫైర్ఆర్మ్‌తో కాల్చిన ఆగంతకుడు, పోలీసుల అదుపులో నిందితుడు
ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న అబేను ఓ గన్‌తో షూట్ చేశాడు. ఓ స్టేషన్ ముందు నిలుచుని ప్రజలను ఉద్దేశించి అబే మాట్లాడుతున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన ఓ వ్యక్తి తన వద్ద ఉన్న గన్‌తో కాల్చాడు.
జపాన్ మాజీ ప్రధాని షింజో అబేను ఓ ఆగంతకుడు షూట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న అబేను ఓ గన్‌తో షూట్ చేశాడు. ఓ స్టేషన్ ముందు నిలుచుని ప్రజలను ఉద్దేశించి అబే మాట్లాడుతున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన ఓ వ్యక్తి తన వద్ద ఉన్న గన్‌తో కాల్చాడు. అబే మాట్లాడుతున్నప్పుడు మొబైల్ ఫోన్‌లో ఓ వ్యక్తి ఆ ప్రసంగాన్ని చిత్రీకరించాడు. అయితే అబే వెనుక నుంచి తొలుత శబ్ధం వినిపించింది. ఆ తర్వాత తెల్లటి పొగ వచ్చింది. శబ్ధం వినిపించగానే అక్కడ ఉన్న జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
మొబైల్ వీడియో తీస్తున్న వ్యక్తి కూడా షేకయ్యాడు. ఈ ఘటనలో 41 ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని నారా సిటీకి చెందిన 41 ఏళ్ళ తెత్సుయా యమగామిగా గుర్తించారు. కాల్పులు జరిగిన తర్వాత అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది అతన్ని పట్టుకున్నారు. హోమ్‌మేడ్ ఫైర్ఆర్మ్‌ను వాడినట్లు గుర్తించారు. కాల్పులు జరిపిన వ్యక్తి జపాన్‌లోని మారీటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్‌లో పని చేశాడు. మారీటైమ్ ఫోర్స్ ఆ దేశ నేవీకి సమానంగా విధులు నిర్వర్తిస్తుంది. కాల్పులకు సంబంధించిన వీడియో ఇదే.
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)