PV Sindhu: ఒలింపిక్స్ ఓటమిపై పీవీ సింధు, ఆ తప్పు వల్లే ఓడిపోయా,వచ్చే ఒలింపిక్స్‌లో ఆడతానా లేదా అన్నదానిపై సింధు కామెంట్స్
ప్రీ క్వార్టర్స్‌లో చైనీస్ ప్రపంచ నంబర్ 9 బింగ్ జాబో రన్ చేతిలో వరుస సెట్లు 21-19,21-14 తేడాతో ఓటమి పాలైంది. 56 నిమిషాల పాటు ఈ గేమ్ సాగగా వరుస గేముల్లో ఓటమి పాలై ఒలింపిక్స్ నుండి నిష్క్రమించింది
August 2: పారిస్ ఒలింపిక్స్‌లో పీవీ సింధు పోరాటం ముగిసింది. ప్రీ క్వార్టర్స్‌లో చైనీస్ ప్రపంచ నంబర్ 9 బింగ్ జాబో రన్ చేతిలో వరుస సెట్లు 21-19,21-14 తేడాతో ఓటమి పాలైంది. 56 నిమిషాల పాటు ఈ గేమ్ సాగగా వరుస గేముల్లో ఓటమి పాలై ఒలింపిక్స్ నుండి నిష్క్రమించింది.
ఈ నేపథ్యంలో తన ఓటమిపై స్పందించింది పీవీ సింధు. డిఫెన్స్‌లో తప్పులు చేయడం వల్లే ఓటమి పాలయ్యానని తెలిపారు. డిఫెన్సివ్ షాట్లను ఎదుర్కొనే క్రమంలో తప్పులు చేశానని, విజయం కోసం శతవిధాలా ప్రయత్నించానని చెప్పారు. చాలా కష్టపడి ఇక్కడి వరకు వచ్చాం అని, ఈ ఓటమికి నేనేం పశ్చాత్తాప పడటం లేదని..పోరాడుతూనే ఉంటానని చెప్పారు. ప్రిక్వార్టర్స్‌లో ప్రతి పాయింట్ కోసం మేమిద్దరం చాలా శ్రమించాం అని కానీ ఫలితం తనకు అనుకూలంగా రాలేదన్నారు.
వచ్చే ఒలింపిక్స్‌లో ఆడతానా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేనన్నారు. ఇంకా నాలుగేళ్ల సమయం ఉందని కాబట్టి స్వదేశం వెళ్లాక విశ్రాంతి తీసుకుని మళ్లీ బరిలోకి దిగుతానని చెప్పారు. ఒక్కోసారి మనది కాని రోజు చూడాల్సి వస్తోందని చెప్పారు.
రియో ఒలింపిక్స్ 2016లో రజతం, టోక్యో ఒలింపిక్స్ 2020లో కాంస్యం గెలిచింది సింధు.ఇక పారిస్ ఒలింపిక్స్ 2024లో మాత్రం ప్రీక్వార్టర్స్‌కే పరిమితమై ఉట్టి చేతులతో ఇంటిదారి పట్టింది.ఇప్పటి వరకు పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మూడు కాంస్య పతకాలు రాగా ఈ మూడు షూటింగ్‌లోనే లభించాయి. ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం, పురుషుల 50 మీటర్ల రైఫిల్‌లో కాంస్య పతకం సాధించిన భారత షూటర్ స్వప్నిల్ కుసాలే