Ahmed Musaddiq: క్రికెట్లో విధ్వంసం అంటే ఇదే..28 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన అహ్మద్ ముస్సాదిక్, అందులో 13 సిక్సర్లు, 7 ఫోర్లు, గౌహర్ మనన్ ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డును బద్దలు కొట్టిన కమ్మర్‌ఫెల్డర్ స్పోర్ట్‌వెరిన్ ఆటగాడు

కేవలం 28 బంతుల్లోనే 13 సిక్సర్లు, 7 ఫోర్ల సహాయంతో సెంచరీ బాది రికార్డు ఇన్నింగ్స్ ఆడాడు. 13 సిక్సర్లు, ఏడు ఫోర్ల సాయంతో 33 బంతుల్లో ఏకంగా 115 పరుగులు సాధించాడు. యూరోపియన్ క్రికెట్ సిరీస్ చరిత్రలో భారత సంతతికి చెందిన గౌహర్ మనన్(29 బంతుల్లో) పేరిట​ ఉన్న ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డును బద్దలు కొట్టాడు.

Ahmed Musaddiq (Photo-Twitter)

యూరోపియన్ క్రికెట్ సిరీస్‌లో ఓ ఆటగాడు పెను విధ్వంసం సృష్టించాడు. కేవలం 28 బంతుల్లోనే 13 సిక్సర్లు, 7 ఫోర్ల సహాయంతో సెంచరీ బాది రికార్డు ఇన్నింగ్స్ ఆడాడు. 13 సిక్సర్లు, ఏడు ఫోర్ల సాయంతో 33 బంతుల్లో ఏకంగా 115 పరుగులు సాధించాడు. యూరోపియన్ క్రికెట్ సిరీస్ చరిత్రలో భారత సంతతికి చెందిన గౌహర్ మనన్(29 బంతుల్లో) పేరిట​ ఉన్న ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డును బద్దలు కొట్టాడు.

కమ్మర్‌ఫెల్డర్ స్పోర్ట్‌వెరిన్ జట్టు తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన 32 ఏళ్ల అహ్మద్ ముస్సాదిక్ (Ahmed Musaddiq) టిహెచ్‌సిసి హాంబర్గ్‌ జట్టుపై వీరవిహారం చేయడంతో ఆ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. అహ్మద్ తన ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, 13 సిక్సర్లు కొట్టాడు, అంటే కేవలం 20 బంతుల్లో 106 పరుగులు ( fastest ton in ECS history off just 28 balls) చేశాడు. మొదటి బంతి నుంచి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రత్యర్ధి బౌలర్లు ఎవరైనా సరే.. బంతిని బౌండరీకి తరలించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు.

Here's His Score Update

ఈ మ్యాచ్‌లో ముస్సాదిక్‌ తొలి బంతి నంచే బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. స్పిన్నర్లు, పేసర్లు అన్న తేడా లేకుండా బంతి బాదడమే లక్ష్యంగా పెట్టుకుని, ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ క్రమంలో 13 బంతుల్లో అర్ధ శతకం, 28 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసి ఇన్నింగ్స్‌ ఆఖరి బంతికి వెనుదిరిగాడు. అనంతరం 199 పరుగలు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ప్రత్యర్థి జట్టు.. 10 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి కేవలం 53 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ముస్సాదిక్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు 145 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది.



సంబంధిత వార్తలు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif