Asia Cup 2022: భారత్ ఫైనల్‌కు చేరాలంటే, పాకిస్తాన్ తదుపరి మ్యాచ్‌లో శ్రీలంకను ఓడించాలి,అలాగే భారత్ మిగతా రెండు మ్యాచ్‌లు గెలివాలి, అది కూడా భారీ రన్ రేట్‌తో..

అయినప్పటికీ, ఇప్పటికీ ఆసియాకప్ ఫైనల్స్ కు (Asia Cup 2022) చేరే అవకాశాలు ఇంకా మిగిలి ఉన్నాయి.

Asia Cup 2022: భారత్ ఫైనల్‌కు చేరాలంటే, పాకిస్తాన్ తదుపరి మ్యాచ్‌లో శ్రీలంకను ఓడించాలి,అలాగే భారత్ మిగతా రెండు మ్యాచ్‌లు గెలివాలి, అది కూడా భారీ రన్ రేట్‌తో..
Mohammad Rizwan (Twitter/ICC)

సూపర్ 4లో పాక్ చేతిలో ఓటమి పాలై ఫైనల్ అవకాశాలను భారత్ సంక్లిష్టం చేసుకుంది. అయినప్పటికీ, ఇప్పటికీ ఆసియాకప్ ఫైనల్స్ కు (Asia Cup 2022) చేరే అవకాశాలు ఇంకా మిగిలి ఉన్నాయి. అదెలాగంటే భారత్ (India) ఈ నెల 6న శ్రీలంకతో, 8న ఆప్ఘనిస్థాన్ తో తలపడనుంది. ఈ రెండింటిలోనూ టీమిండియా విజయం సాధించాల్సి ఉంటుంది.

భారత్ మిగిలిన రెండు మ్యాచుల్లోనూ నెగ్గితే, అప్పుడు ఆప్ఘనిస్థాన్ ఎలిమినేట్ అవుతుంది. అలాగే, తదుపరి మ్యాచ్ లో శ్రీలంకను పాకిస్థాన్ (Pakistan) ఓడించగలిగితే.. అప్పుడు శ్రీలంక (Srilanka)ఇంటికి వెళ్లిపోతుంది. ఒకవేళ శ్రీలంక మిగిలిన రెండింటిలో నెగ్గితే అప్పుడు నెట్ రన్ రేటు కీలకం అవుతుంది. కనుక భారత్ శ్రీలంక, అప్ఘానిస్థాన్ పై మంచి మార్జిన్ తో విజయం సాధించాల్సి ఉంటుంది. అప్పుడు ఫైనల్స్ కు చేరుకోవచ్చు.

నరాలు తెగే ఉత్కంఠభరిత పోరు! ఒక బాల్ మిగిలి ఉండగానే విజయం సాధించిన పాకిస్తాన్, మహ్మద్ రిజ్వాన్ మెరుపు ఇన్నింగ్స్‌తో పాక్‌ గెలుపు, ఆ ఒక్క క్యాచ్‌ మిస్సవ్వడంతోనే మ్యాచ్‌ పోయిందంటూ ఫ్యాన్స్ ఫైర్

ప్రస్తుతం పాకిస్థాన్ నెట్ రన్ రేటు ప్లస్0.126గా ఉంది. శ్రీలంక నెట్ రన్ రేట్ ప్లస్ 0.589, భారత్ నెట్ రన్ రేటు మైనస్ 0.126గా ఉంది. భారత్ మిగిలిన రెండు మ్యాచుల్లో గెలిచి తీరాల్సిన అవసరం ఏర్పడింది. ఆ రెండు జట్ల బలబలాలను పరిశీలిస్తే, భారత్ కే (India) అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే జరిగితే ఫైనల్స్ లో మళ్లీ భారత్, పాకిస్థాన్ పోరాడనున్నాయి. దీనిపై పాక్ క్రికెటర్ రిజ్వాన్ స్పందిస్తూ.. ఇది మూడు మ్యాచుల పాక్-భారత్ సిరీస్ అవుతుందని సరదాగా వ్యాఖ్యానించాడు.



సంబంధిత వార్తలు

Health Tips: చలికాలంలో కీళ్ల నొప్పులు ఎక్కువ అవ్వడానికి కారణాలేంటి..

Health Tips: విటమిన్ బి12 లోపంతో బాధపడుతున్నారా ,అయితే ఈ కూరలతో మీ సమస్యకు పరిష్కారం..

Health Tips: షుగర్ వ్యాధితో బాధపడేవారు మీ ఆహారంలో ఈ పండ్లను చేర్చుకుంటే మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి..

Health Tips: ఉదయాన్నే ఖాళీ కడుపుతో బీట్ రూట్ రసాన్ని తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా..