Notice to BCCI President Roger Binny: బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నెలకే రోజర్ బిన్నీకి షాక్, మ్యాచ్‌ల ప్రసార హక్కులు స్టార్ స్పోర్ట్స్‌ కు ఇవ్వడంపై ఎథిక్స్ ఆఫీసర్ నోటీసులు, కోడలు కోసమే అలా చేశారంటూ ఫిర్యాదు

భారత్‌లో బీసీసీఐ మ్యాచ్‌ల (BCCI Matches) ప్రసార హక్కులు ఉన్న స్టార్ స్పోర్ట్స్‌లో రోజర్ బిన్నీ కోడలు మయంతి లాంగర్ (Mayanthi Launger) పనిచేస్తోంది. ఇది కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్ కిందకే వస్తుందని మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘానికి చెందిన సంజీవ్ గుప్తా (Sanjeev Gupta) ఫిర్యాదు చేశాడు.

BCCI President Roger Binny (Photo: PTI)

New Delhi, NOV 30: బీసీసీఐ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ (Roger Binny) ఈ ఏడాది అక్టోబర్ 18న బాధ్యతలు చేపట్టిన విషయం విధితమే. బిన్నీ 1983 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడు. తాజాగా 2023 వన్డే వరల్డ్ కప్‌ను గెలిచేందుకు టీమిండియా (Team ndia) మేనేజ్‌మెంట్ వ్యూహరచన చేస్తోంది. ఇప్పటికే సెలక్షన్ కమిటీపై వేటువేసిన బీసీసీఐ, త్వరలోనే ఫార్మాట్ల వారిగా కెప్టెన్లను నియమించాలనే యోచనలో రోజర్ బిన్నీ (Roger Binny) కసరత్తు చేస్తున్నారు. ఇదిలాఉంటే బిన్నీకి ఎథిక్స్ ఆఫీసర్ వినీత్ శరణ్ షాకిచ్చాడు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీకి ఎథిక్స్ ఆఫీసర్ వినీత్ శరణ్ (Vineet Saran) కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ (conflict of interest) నోటీసులు అందజేశారు. అయితే, ఈ నోటీసులో తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని రుజువుచేసేలా డిసెంబర్ 20లోగా బిన్నీ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.

PT Usha: భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షురాలిగా పిటి ఉష, ఈ పదవికి ఎన్నికైన తొలి మహిళగా గుర్తింపు పొందిన పరుగుల రాణి, ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించిన అధికారులు 

భారత్‌లో బీసీసీఐ మ్యాచ్‌ల (BCCI Matches) ప్రసార హక్కులు ఉన్న స్టార్ స్పోర్ట్స్‌లో రోజర్ బిన్నీ కోడలు మయంతి లాంగర్ (Mayanthi Launger) పనిచేస్తోంది. ఇది కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్ కిందకే వస్తుందని మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘానికి చెందిన సంజీవ్ గుప్తా (Sanjeev Gupta) ఫిర్యాదు చేశాడు. గుప్తా ఫిర్యాదుపై స్పందించిన ఎథిక్స్ ఆఫీసర్.. వివరణ కోరుతూ బిన్నీకి నోటీసులిచ్చాడు.

Sanju Samson Fans Protest: సంజూ శాంసన్‌ను ఇండియా టీంలోకి తీసుకోవాల్సిందే, FIFA ప్రపంచకప్ 2022లో బ్యానర్లతో మద్ధతుగా నిలుస్తున్న అభిమానులు 

నవంబర్ 21నే రోజర్ బిన్నీకి నోటీసులు జారీ చేస్తూ లేఖ రాశారు. అఫిడవిట్ ద్వారా డిసెంబర్ 20వ తేదీలోగా లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని బిన్నీకి శరణ్ సూచించారు. ‘బీసీసీఐ నిబంధనల్లోని రూల్ 39(2)(బీ) కింద మీపై ఫిర్యాదు అందిందని.. మీరు రూల్ (1) (i), రూల్ 38(2)ను ఉల్లంఘించారని’ శరణ్ తన నోటీసులో పేర్కొన్నారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Andhra Pradesh: ఏలూరులో దారుణం, ఎమ్మారై స్కానింగ్ చేస్తుండగా రేడియేషన్ తట్టుకోలేక మహిళ మృతి, సుష్మితా డయాగ్నస్టిక్‌ సెంటర్‌ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని భర్త ఆందోళన

PM Modi Speech in Lok Sabha: పదేళ్లలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికాన్ని జయించారు, లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చర్చ సందర్భంగా ప్రధాని మోదీ

US Begins Deportation of Indian Migrants: అక్రమ వలసదారులపై ట్రంప్ సర్కారు కొరడా, భారతీయులను వెనక్కి పంపుతున్న అగ్రరాజ్యం, దాదాపు 18 వేల మంది భారతీయులు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నట్లుగా వార్తలు

Health Tips: తరచుగా నీరసంగా అలసటగా అనిపిస్తుందా, ఈ ఆహార పదార్థాలను ప్రతిరోజు తీసుకోండి మీ సమస్యకు పరిష్కారం..

Share Now