DLS Method: డక్‌వర్త్ లూయిస్ ఫార్ములా! అసలు ఈ రూల్ ఏంటి? దీనికి ఆద్యులు ఎవరు? ఇది అర్థం కావాలంటే దీనిని కూడా స్కూల్లో ఒక సబ్జెక్ట్ లా మార్చాలేమో.
దీని వెనక ఉన్న ఆసక్తికరమైన కథ చదవండి...
క్రికెట్ చూసే వాళ్లందరికీ డక్ వర్త్ లూయిస్ (Duckworth Lewis method) విధానం గురించి తెలిసే ఉంటుంది. మ్యాచ్ మధ్యలో కొద్దిసేపు ఆగిపోయి తిరిగి కొనసాగిస్తున్నప్పుడు ఈ విధానం అమలులోకి వస్తుంది. పరిమిత ఓవర్ల (వన్డే / టీ20) క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు, సాధారణంగా ఆ ఆట మొత్తం (రెండు ఇన్నింగ్స్) పూర్తి అవటానికి నిర్ధిష్ట సమయం అనేది ఉంటుంది. అయితే మొదటి ఇన్నింగ్స్ ఆట ప్రారంభం అయిన కొద్ది సేపటికి మ్యాచ్ నిలిచిపోతే అప్పటికి ఎన్ని ఓవర్లు పూర్తయ్యాయి అనేది పరిగణలోకి తీసుకుంటారు. మొదటి ఇన్నింగ్స్ పూర్తవటానికి ఇంకా సమయం ఉంటే ఆగిపోయిన కాలానికి ఓవర్లు కుదించి వారినే తిరిగి ఆడిస్తారు, ఒకవేళ సమయం మించిపోతే ఇక వారి ఆట అంతకే నిలిపివేసి రెండో జట్టును బ్యాటింగ్ చేయాల్సిందిగా అంపైర్లు ఆహ్వానిస్తారు.
ఇక్కడ ఛేజింగ్ చేసే జట్టు యొక్క లక్ష్యం మొదటి జట్టు చేసిన దానికంటే కూడా ఇంకా పెరగొచ్చు లేదా తగ్గిపోవచ్చు. అది మొదటి ఇన్నింగ్స్ ఆడిన జట్టు రన్ రేట్ పెరుగుతూ పోయిందా? తగ్గుతూ పోయిందా? పూర్తి ఆట ఆడితే ఎన్ని పరుగులు చేసి ఉండొచ్చు అనేది ఈ డక్ వర్త్ లూయిస్ మెథడ్ ప్రకారం అంచనా వేసి నిర్ణయిస్తారు.
సూత్రప్రాయంగా ఇలా....
Team 2's par score = Team 1's score x Team 1's resources - Team 2's resources
టీం2 లక్ష్యం = టీం1 సాధించిన స్కోరు X టీం1 కు ఉన్న వనరులు\ టీం2 కు ఉన్న వనరులు
అంతుచిక్కని ఈ DLS విధానం వెనక ఉన్న మేధావులెవరు?
క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లాండ్ దేశంలో ఫ్రాంక్ డక్ వర్త్ (Frank Duckworth) మరియు టోనీ లూయిస్ (Tony Lewis) అనే ఇద్దరు గణాంక నిపుణులు ప్రతిపాదించిన సిద్ధాంతం ప్రకారంగా వారి పేరుమీదుగా మొదటగా డక్ వర్త్ లూయిస్ DL విధానాన్ని 1997లో ఐసీసీ ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఈ లెక్కల్లో కొన్ని లోపాలు ఉండటంతో ప్రొఫెసర్ స్టీవెన్ స్టెర్న్(Professor Steven Stern) DL విధానానికి అనుబంధంగా మరో సిద్ధాంతాన్ని 2014లో ప్రవేశపెట్టారు, కాబట్టి ఆయన పేరు కూడా కలుపుకొని ప్రస్తుతం డక్ వర్త్ లూయిస్ స్టెర్న్ DLS విధానం అమలు అవుతుంది. అయినప్పటికీ ఈ విధానంలో కూడా ఎన్నో అనుమానాలు, జవాబు లేని ప్రశ్నలు ఎవరికీ అంతుచిక్కడం లేదు.