ICC T20 World Cup 2024: పోరాడకుండానే ప్రపంచకప్ నుంచి న్యూజీలాండ్ ఔట్, సూపర్ 8 బెర్తులోకి ప్రవేశించిన ఆఫ్ఘ‌నిస్తాన్, ఇప్పటికే వెస్టిండీస్ ఎంట్రీ

ఆఫ్ఘ‌నిస్తాన్ విక్ట‌రీతో గ్రూప్ సి నుంచి న్యూజిలాండ్ జ‌ట్టు నాకౌట్ అయ్యింది.ఈ గ్రూపు నుంచి ఇప్ప‌టికే వెస్టిండీస్ జ‌ట్టు సూప‌ర్ 8లోకి ప్ర‌వేశించగా తాజాగా ఆఫ్ఘ‌నిస్తాన్ కూడా ఆరు పాయింట్ల‌తో సూప‌ర్‌-8 బెర్తును క‌న్ఫ‌ర్మ్ చేసుకున్న‌ది.

New Zealand Team (Photo-ICC)

ఆఫ్ఘ‌నిస్తాన్ విక్ట‌రీతో గ్రూప్ సి నుంచి న్యూజిలాండ్ జ‌ట్టు నాకౌట్ అయ్యింది.ఈ గ్రూపు నుంచి ఇప్ప‌టికే వెస్టిండీస్ జ‌ట్టు సూప‌ర్ 8లోకి ప్ర‌వేశించగా తాజాగా ఆఫ్ఘ‌నిస్తాన్ కూడా ఆరు పాయింట్ల‌తో సూప‌ర్‌-8 బెర్తును క‌న్ఫ‌ర్మ్ చేసుకున్న‌ది. ఈ గ్రూపులో రెండు మ్యాచ్‌లు ఆడిన న్యూజిలాండ్ రెండింటిలో ఓడిపోయి ఇక పాయింట్ల ఖాతా తెర‌వ‌లేదు. ఒక‌వేళ త‌ర్వాత రెండు మ్యాచుల్లో కివీస్ నెగ్గినా.. ఆ జ‌ట్టుకు సూప‌ర్ 8 వెళ్లే ఛాన్సు లేదు. ఒమ‌న్‌ విసిరిన టార్గెట్‌ని మూడు ఓవర్లలోనే ఫినిష్ చేసిన ఇంగ్లండ్, 8 వికెట్ల తేడాతో ఘన విజయం

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌(T20 World Cup)లో ప‌పువా న్యూగునియాతో జ‌రిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఆప్ఘన్ జ‌ట్టు విజ‌యం సాధించింది. ఆఫ్ఘ‌న్ బౌల‌ర్ ఫ‌జ‌ల్ల‌క్ ఫారూకీ అద్భుత‌మైన బౌలింగ్‌తో ప‌పువ బ్యాట‌ర్ల‌ను ముప్పుతిప్ప‌లు పెట్టారు. గుల్బ‌దిన్ న‌యిబ్ 49 ర‌న్స్ స్కోర్ చేసి ఆఫ్ఘ‌న్ విక్ట‌రీలో కీల‌క పాత్ర పోషించాడు. ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన ప‌పువా న్యూ గునియా కేవ‌లం 95 ప‌రుగుల‌కే ఆలౌటైంది. ఫారూకీ కీల‌క‌మైన మూడు వికెట్లు తీసుకున్నాడు. స్వ‌ల్ప ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఆఫ్ఘ‌న్ జ‌ట్టు 15 ఓవ‌ర్ల‌లోనే టార్గెట్‌ను అందుకున్న‌ది.