India vs Bangladesh Live Score: బంగ్లాదేశ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ, 12 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన బంగ్లా టీం, లంచ్ సమయానికి స్కోరు 63/3

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌ ఆరంభంలోనే ఓపెనర్లు షాద్‌మన్‌ ఇస్లామ్‌, ఇమ్రుల్‌ కేస్‌ వికెట్లను కోల్పోయింది. వీరిద్దరూ తలో ఆరు పరుగులు చేసి పెవిలియన్‌ చేరారు.

Ishant Sharma and Umesh Yadav (Photo Credits: Getty Images)

Indore, November 14: టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టు(India vs Bangladesh)లో బంగ్లాదేశ్‌(Bangladesh)కు ఆదిలోనే షాక్‌ తగిలింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌ ఆరంభంలోనే ఓపెనర్లు షాద్‌మన్‌ ఇస్లామ్‌, ఇమ్రుల్‌ కేస్‌ వికెట్లను కోల్పోయింది. వీరిద్దరూ తలో ఆరు పరుగులు చేసి పెవిలియన్‌ చేరారు. ఇషాంత్‌ (Ishant Sharma) వేసిన ఆరో ఓవర్‌ చివరి బంతికి షాద్‌మన్‌ ఔట్‌ కాగా, ఆపై ఉమేశ్‌ యాదవ్‌(Umesh Yaadav) వేసిన ఏడో ఓవర్‌ ఆఖరి బంతికి ఇమ్రుల్‌ పెవిలియన్‌ బాట పట్టాడు.

షాదమ్‌న్‌ ఇచ్చిన క్యాచ్‌ను వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా పట్టగా, ఇమ్రుల్‌ ఇచ్చిన క్యాచ్‌ను రహానే అందుకున్నాడు. దాంతో 12 పరుగులకే బంగ్లాదేశ్‌ రెండు వికెట్లను చేజార్చుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకుంది. దాంతో భారత్‌కు ఫీల్డింగ్‌ తప్పలేదు. కాగా 2018 నుంచి భారత్‌ (India)తొలిసారి ఫీల్డింగ్‌ చేసిన టెస్టు మ్యాచ్‌ల్లో అధిక శాతం ప్రతికూల ఫలితమే వచ్చింది. అప్పట్నుంచి ఇప్పటివరకూ చూస్తే భారత్‌ ఏడుసార్లు తొలుత ఫీల్డింగ్‌ చేసిన సందర్భాల్లో ఆరుసార్లు ఓటమి చవిచూసింది. ఒకే మ్యాచ్‌ గెలిచింది.

తొలి టెస్టులో బంగ్లాదేశ్ లంచ్ విరామ సమయానికి 26 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి, 63 పరుగులు సాధించింది. కెప్టెన్ మొమినల్ హక్ (22), ముష్ఫికర్ రహీమ్ (14)(Mominul Haque and Mushfiqur Rahim) క్రీజులో ఉన్నారు. కీలకమైన బ్యాట్స్‌మెన్ ముష్ఫికర్‌కు లైఫ్ లభించింది. ఉమేష్ బౌలింగ్‌లో రెండో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కెప్టెన్ కోహ్లి అతని క్యాచ్‌ని జారవిడిచాడు. దీంతో, ఊపిరి పీల్చుకున్న ముష్ఫికర్ జాగ్రత్తగా ఆడుతున్నాడు. భారత పేసర్లు ఉమేష్, ఇషాంత్, షమీ తలో వికెట్ పడగొట్టారు.