India vs New Zealand: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు రెస్ట్, న్యూజిలాండ్ టూర్‌లో భారత టీ20 జట్టు కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా, వన్డే జట్టు కెప్టెన్‌గా శిఖర్ ధవన్, పూర్తి లిస్ట్ ఇదిగో..
ఈ పర్యటనలో భాగంగా భారత్ 3 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. ఈ రెండు సిరీస్‌ల కోసం భారత జట్టును సెలెక్షన్ కమిటీ ఇవాళ (అక్టోబర్ 31) ప్రకటించింది.
టీ20 ప్రపంచకప్-2022 తర్వాత నవంబర్ 18 నుంచి 30 వరకు టీమిండియా న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా భారత్ 3 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. ఈ రెండు సిరీస్‌ల కోసం భారత జట్టును సెలెక్షన్ కమిటీ ఇవాళ (అక్టోబర్ 31) ప్రకటించింది. కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌లకు రెస్ట్ ఇచ్చిన సెలెక్షన్ కమిటీ.. దినేశ్ కార్తీక్, అశ్విన్‌లను పక్కకు పెట్టింది.అలాగే మహమ్మద్ షమీని కూడా పక్కనబెట్టింది
రోహిత్ స్థానంలో టీ20 సిరీస్‌కు హార్ధిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. వన్డే సిరీస్‌కు శిఖర్ ధవన్ సారధ్య బాధ్యతలను చేపట్టనున్నాడు. కివీస్ పర్యటనలో నవంబర్ 18న తొలి టీ20 ఆడనున్న టీమిండియా.. 20, 22 తేదీల్లో రెండు, మూడు మ్యాచ్‌లు ఆడనుంది. అనంతరం 25న తొలి వన్డే, 27, 30 తేదీల్లో రెండు, మూడు వన్డేలు ఆడనుంది.
న్యూజిలాండ్ పర్యటనకు భారత టీ20 జట్టు..
హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్
Here's BCCI Tweets
న్యూజిలాండ్ పర్యటనకు భారత వన్డే జట్టు..
శిఖర్ ధవన్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్, వికెట్‌కీపర్), శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, శార్ధూల్ ఠాకూర్, షాబాజ్ అహ్మద్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్