IPL 2022 venues: మొత్తం 74 మ్యాచ్‌ల్లో 70 లీగ్‌ మ్యాచ్‌లు ముంబైలోనే.., వాంఖడే, బ్రబౌర్న్‌, డీవై పాటిల్‌, పుణెలోని గహుంజే స్టేడియాల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు

మొత్తం 74 మ్యాచ్‌ల్లో.. 70 లీగ్‌ మ్యాచ్‌లను ముంబైలోని వాంఖడే, బ్రబౌర్న్‌, డీవై పాటిల్‌, పుణెలోని గహుంజే స్టేడియాల్లో నిర్వహించనున్నారు. ముంబైలో 55, పుణెలో 15 మ్యాచ్‌లు జరగనుండగా.. మొత్తం 12 డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లను ఖరారు చేశారు.

IPL Trophy Representative Image (Photo Credits: Twitter)

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్‌-2022 ప్రారంభతేదీని ప్రకటించారు. 10 జట్ల మెగా లీగ్‌ వచ్చే నెల 26న ముంబైలో ఆరంభం కానుండగా.. మే 29న ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. గురు వారం జరిగిన పాలకమండలి సమా వేశంలో టోర్నీ తేదీలు, వేదికలను ఖరారు చేసినట్టు ఐపీఎల్‌ చైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌ తెలిపాడు. మొత్తం 74 మ్యాచ్‌ల్లో.. 70 లీగ్‌ మ్యాచ్‌లను ముంబైలోని వాంఖడే, బ్రబౌర్న్‌, డీవై పాటిల్‌, పుణెలోని గహుంజే స్టేడియాల్లో నిర్వహించనున్నారు. ముంబైలో 55, పుణెలో 15 మ్యాచ్‌లు జరగనుండగా.. మొత్తం 12 డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లను ఖరారు చేశారు.

పూర్తి షెడ్యూల్‌ విడుదల చేసినప్పుడు వీటిపై స్పష్ట త రానుంది. కాగా, నాలుగు ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌లకు సంబంధించిన వేదికలపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. అయితే, అహ్మదాబాద్‌లో నాకౌట్‌ మ్యాచ్‌లను నిర్వహించే అవకాశం ఉంది. లీగ్‌ ఆరంభదశలో 40 శాతం మంది ప్రేక్షకులను అనుమతించనుండగా.. కరోనా అదుపులోకి వస్తే పూర్తి స్థాయిలో గేట్లు ఎత్తేసే అవకాశం ఉంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement