Ind Vs NZ New Zealand won the toss elects field first(X)

Delhi, Mar 2:  ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా భారత్‌తో తలపడుతోంది న్యూజిలాండ్( Ind Vs NZ). ఇప్పటికే ఇరు జట్లు సెమీ ఫైనల్‌కు చేరగా లీగ్ దశలో ఇరుజట్లకు ఇదే చివరి మ్యాచ్.

ఇక టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ సాంటర్న్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇది మంచి పిచ్‌లా అనిపిస్తోంది, ఆరంభంలో ఒత్తిడి తీసుకురావాలని అనుకుంటున్నాం. తర్వాత పరిస్థితులు మనకు అనుకూలంగా మారుతాయని ఆశిస్తున్నాం అందుకే బౌలింగ్ ఎంచుకున్నామని చెప్పారు(New Zealand vs India).

. మేము ఇప్పటికే సెమీఫైనల్‌కు వెళ్లినా, ఇక్కడ విజయం సాధించడం మాకు ముఖ్యం... డేరిల్ మిచెల్ జట్టులోకి రాగా కాన్వే ఈ మ్యాచ్ ఆడడం లేదు అన్నారు.

ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో ఈజీగా నెగ్గిన సౌతాఫ్రికా, చాంపియన్స్‌ ట్రోఫీ సెమీస్‌లో బెర్త్ ఖరారు

టాస్ గెలిస్తే తొలుత బ్యాటింగ్ చేయాలని అనుకున్నాం... కానీ ఓడినా తొలుత బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చిందన్నారు. మా బౌలర్లను పరీక్షించాలి. మునుపటి రెండు మ్యాచుల్లో ఛేజ్ చేశాము, అందువల్ల ఈసారి కొత్త ప్రాక్టీస్ కావాలి అన్నారు.

హర్షిత్ రానా స్థానంలో వరుణ్ చక్రవర్తి జట్టులోకి వచ్చాడని గత రెండు మ్యాచుల్లో మేము 19 వికెట్లు తీసుకున్నాం. మా స్పిన్నర్లు విరామంలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు, తర్వాత పేసర్లు వికెట్లు తీయగలిగారు అన్నారు.

 Ind Vs NZ: New Zealand won the toss elects field first

 

జట్ల వివరాలు:

భారత జట్టు :

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, KL రాహుల్ (వికెట్‌కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి

న్యూజిలాండ్ జట్టు:

విల్ యంగ్, రాచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డేరిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్‌కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మ్యాట్ హెన్రీ, కైల్ జామీసన్, విలియం ఓరౌర్క్

ఇక వరుసగా 10వ సారి టాస్ ఓడారు రోహిత్ శర్మ. ఇక వన్డేల్లో అత్యధిక టాస్‌లు కోల్పోయిన కెప్టెన్ల వివరాలను చూస్తే బ్రియాన్ లారా 12 సార్లు, పీటర్ బోర్రెన్ 11 సార్లు రోహిత్ శర్మ కంటే ముందు ఉన్నారు.