ICC Champions Trophy 2025(X)

Delhi, Feb 23: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది పాకిస్థాన్(India Vs Pakistan). భారత బౌలర్ల ధాటికి పాకిస్తాన్ భారీ స్కోరు చేయలేకపోయింది. 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ ముందు 242 పరుగుల టార్గెట్ ను విధించింది.

ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి ఔరా అనిపించాడు కుల్‌దీప్. 42వ ఓవర్‌లో 4వ బంతికి సల్మాన్ అఘా (19), 5వ బంతికి షహీన్ షా అఫ్రిది(0)ను ఔట్ చేశాడు. పాకిస్థాన్ బ్యాటర్లలో షకీల్ 62,రిజ్వాన్ 46,బాబర్ అజామ్ 23, కుష్ దిల్ 38   పరుగులు చేశారు.

భారత బౌలర్లలో కుల్దీప్ 3,పాండ్యా 2,అక్షర్ పటేల్ 1,జడేజా 1 వికెట్ తీశారు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాకిస్థాన్ భారీ స్కోరు సాధించలేకపోయింది.

వన్డేల్లో 200 వికెట్లు తీసిన హార్ధిక్ పాండ్యా.. 9 ఏళ్లలో ఈ ఫీట్ సాధించిన హార్ధిక్, వీడియో ఇదిగో

టీమిండియా జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, షమీ, కుల్‌దీప్‌ యాదవ్

Akshar Patel Beautiful Bowling 

పాకిస్థాన్‌ జట్టు : ఇమామ్‌ ఉల్ హక్, బాబర్ అజామ్, సౌద్‌ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), సల్మాన్‌ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షహీన్ అఫ్రిది, నసీమ్ షా, హారిస్‌ రవూఫ్, అబ్రార్‌ అహ్మద్