Megastar Chiranjeevi for India Vs Pakistan Match(X)

Delhi, Feb 23:  ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది పాకిస్థాన్(India Vs Pakistan). భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌ ను వీక్షించారు మెగాస్టార్ చిరంజీవి. పెవిలియన్‌లో కూర్చుని భారత క్రికెటర్లు తిలక్ వర్మ, అభిషేక్‌లతో కలిసి మ్యాచ్ చూశారు.

అలాగే ఏపీ మంత్రి నారా లోకేశ్, డైరెక్టర్ సుకుమార్ తదితరులు ప్రత్యక్షంగా మ్యాచ్‌ను వీక్షించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

టీమిండియా టార్గెట్ 242, హాఫ్ సెంచరీతో రాణించిన షకీల్, మూడు వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్ 

ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌లో భారత బౌలర్ల ధాటికి పాకిస్తాన్ భారీ స్కోరు చేయలేకపోయింది. 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ ముందు 242 పరుగుల టార్గెట్ ను విధించింది. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి ఔరా అనిపించాడు కుల్‌దీప్. 42వ ఓవర్‌లో 4వ బంతికి సల్మాన్ అఘా (19), 5వ బంతికి షహీన్ షా అఫ్రిది(0)ను ఔట్ చేశాడు. పాకిస్థాన్ బ్యాటర్లలో షకీల్ 62,రిజ్వాన్ 46,బాబర్ అజామ్ 23, కుష్ దిల్ 38 పరుగులు చేశారు.

Megastar Chiranjeevi for India Vs Pakistan Match

ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి ఔరా అనిపించాడు కుల్‌దీప్. 42వ ఓవర్‌లో 4వ బంతికి సల్మాన్ అఘా (19), 5వ బంతికి షహీన్ షా అఫ్రిది(0)ను ఔట్ చేశాడు. పాకిస్థాన్ బ్యాటర్లలో షకీల్ 62,రిజ్వాన్ 46,బాబర్ అజామ్ 23, షా పరుగులు చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్ 3,పాండ్యా 2,అక్షర్ పటేల్ 1,జడేజా 1 వికెట్ తీశారు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాకిస్థాన్ భారీ స్కోరు సాధించలేకపోయింది.

Nara Lokesh for India Vs Pakistan Match