IPL Eliminated Teams List: ఐపీఎల్ నుంచి మూడు జట్లు అవుట్, టాప్‌లోకి దూసుకువెళ్ళిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌, ప్లే ఆఫ్స్ రేసులో నిలిచే జట్లు ఏవంటే..

మే 13న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బాల్ పడకుండానే మ్యాచ్ రద్దు కావడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ 2024లో గుజరాత్ టైటాన్స్ (జీటీ) నిష్క్రమించిన మూడో జట్టుగా అవతరించింది.

IPL 2022 Winners Gujarat Titans Become 3rd Team To Be Eliminated From Season 2024 Know More Details on Playoffs Scenario

మే 13న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బాల్ పడకుండానే మ్యాచ్ రద్దు కావడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ 2024లో గుజరాత్ టైటాన్స్ (జీటీ) నిష్క్రమించిన మూడో జట్టుగా అవతరించింది.ఇరుజ‌ట్ల‌కూ చెరో పాయింట్ ల‌భించింది. దీంతో కేకేఆర్ టేబుల్ లో టాప్‌ప్లేస్‌కు చేరుకుంది. మ‌రోవైపు గుజ‌రాత్ టోర్నీ నుంచి నిష్క్ర‌మించింది. ప్ర‌స్తుతం జీటీకి 11 పాయింట్లు ఉన్నాయి.

త‌ర్వాతి మ్యాచ్ స‌న్‌రైజ‌ర్స్‌తో గెలిచినా 13 పాయింట్లే అవుతాయి. దీంతో గుజ‌రాత్ టైటాన్స్ అధికారికంగా లీగ్ నుంచి ఎలిమినేట్ అయింది. దీంతో ఈ సీజ‌న్‌లో టోర్నీ నుంచి నిష్క్ర‌మించిన మూడో జ‌ట్టుగా గుజ‌రాత్ నిలిచింది. జీటీ కంటే ముందే ముంబై ఇండియ‌న్స్‌, పంజాబ్ కింగ్స్ ఇంటిముఖం ప‌ట్టిన విష‌యం తెలిసిందే.  ప్లే అప్స్ చేరడానికి ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీతో ఓడి అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న రిషబ్ పంత్ టీం

మునుప‌టి మ్యాచ్‌లో ముంబైను మ‌ట్టిక‌రిపించిన కోల్‌క‌తా ఇప్ప‌టికే ప్లే ఆఫ్స్ చేరిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కు 13 మ్యాచులు ఆడిన కేకేఆర్‌ 19 పాయింట్లతో ప్ర‌స్తుతం పాయింట్ల టేబుల్‌లో అగ్ర‌స్థానానికి చేరింది. దీంతో క్వాలిఫయర్-1లో కేకేఆర్ పోటీ ప‌డ‌నుంది. మ్యాచ్ ర‌ద్దు అయిన వెంట‌నే సోష‌ల్ మీడియా వేదిక‌గా నైట్‌రైడ‌ర్స్ ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ ఓ ట్వీట్ కూడా చేసింది. 'ప‌దేళ్ల త‌ర్వాత తాము క్వాలిఫయర్-1 ఆడ‌బోతున్నామ‌ని' త‌న ట్వీట్‌లో పేర్కొంది. రసవత్తరంగా ఐపీఎల్, ప్లే అప్స్‌లో 3 స్థానాల కోసం పోటీ పడుతున్న ఐదు జట్లు ఇవే, ఇప్పటికే ప్లేఆఫ్స్‌ బెర్తు ఖరారు చేసుకున్న కోలకతా

ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ రెండో స్థానంలో కొన‌సాగుతోంది. 12 మ్యాచులాడిన ఆర్ఆర్ 16 పాయింట్లు సాధించింది. త‌న త‌ర్వాతి రెండు మ్యాచుల్లో ఒక‌టి గెలిచినా ప్లే ఆఫ్స్ చేరుతుంది. అలాగే డిపెండింగ్ ఛాంపియ‌న్ చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్‌కే) 13 మ్యాచుల్లో 14 పాయింట్ల‌తో మూడో స్థానంలో ఉంది. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ (ఎస్ఆర్‌హెచ్‌) 12 మ్యాచుల్లో 7 విజ‌యాల‌తో 14 పాయింట్లు సాధించి నాలుగో ప్లేస్‌లో కొన‌సాగుతోంది. అలాగే రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు 13 మ్యాచుల్లో 12 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. కాగా, ఆర్‌సీబీ తాను ఆడిన చివ‌రి ఐదు మ్యాచుల్లో వ‌రుస‌గా గెలిచి ఇలా ప్లే ఆఫ్స్ రేసులో నిల‌వ‌డం విశేషం.

ప్లే ఆఫ్స్ రేసు నుంచి గుజరాత్ టైటాన్స్ నిష్ర్కమించడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు ఒకింత గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. బెంగళూరు, ఢిల్లీ, లక్నో జట్లు ప్రస్తుతం తలో 12 పాయింట్లు, చెన్నై 14 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు పోటీ పడుతుండగా గుజరాత్ నిష్ర్కమణతో ఈ జట్ల అవకాశాలు మెరుగయ్యాయి. ఒకవేళ చెన్నై మిగిలివున్న మ్యాచ్‌లో ఓడిపోతే ఆ జట్టు ఖాతాలో 14 పాయింట్లు ఉంటాయి. మరోవైపు సన్‌రైజర్స్ కూడా మిగిలివున్న రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోతే ఆ జట్టు ఖాతాలోనూ 14 పాయింట్లే ఉంటాయి. ఈ సమీకరణంలో బెంగళూరు, ఢిల్లీ తమ చివరి మ్యాచ్‌ల్లో గెలిస్తే 14 పాయింట్లతో ప్లే ఆఫ్స్ బెర్తులు రసవత్తరంగా మారతాయడంలో ఎలాంటి సందేహం లేదు.