IPL 2023: వీడియో ఇదిగో, ధోని సిక్స్‌ల దెబ్బకి బద్దలైన పాత రికార్డులు, ధోనీ బ్యాటింగ్‌కు రాగానే రూ.2 కోట్ల మార్క్‌ను దాటిన జియో సినిమా వ్యూస్

ఐపీఎల్‌-2023లో రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఓటమి పాలైనప్పటికీ.. ఆ జట్టు కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని సిక్స్ ల దెబ్బకి రేటింగ్ ఆకాశానికి ఎగబాకింది. ధోని ఆఖరి వరకు క్రీజులో ఉన్నప్పటికీ తన జట్టును గెలిపించలేకపోయాడు.

Ravindra Jadeja Bows To MS Dhoni After CSK's Thrilling Win Over MI(Photo-Video Grab)

ఐపీఎల్‌-2023లో రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఓటమి పాలైనప్పటికీ.. ఆ జట్టు కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని సిక్స్ ల దెబ్బకి రేటింగ్ ఆకాశానికి ఎగబాకింది. ధోని ఆఖరి వరకు క్రీజులో ఉన్నప్పటికీ తన జట్టును గెలిపించలేకపోయాడు. చివరి ఓవర్‌లో సీఎస్‌కే 21 పరుగులు అవసరమవ్వగా.. ధోని రెండు సిక్స్‌లు బాదినప్పటికీ విజయం మాత్రం రాజస్తాన్‌ వైపే నిలిచింది.ఈ మ్యాచ్‌లో కేవలం 17 బంతులు మాత్రమే ఎదుర్కొన్న మిస్టర్‌ కూల్‌.. ఒక్క ఫోర్‌, 3 సిక్సర్లతో 32 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.

చెన్నైకి భారీ షాక్, మోకాలి గాయంతో బాధపడుతున్న ధోనీ, అందుకే చివరి బంతికి ఫోర్ కొట్టి గెలిపించలేకపోయాడని తెలిపిన సీఎస్‌కే హెడ్‌ కోచ్‌ స్టీఫెన్ ఫ్లెమింగ్

ధోనీ బ్యాటింగ్‌కు రాగానే డిజిటల్‌ బ్రాడ్‌ కాస్టర్‌ జియో సినిమా వ్యూస్ రూ. 2 కోట్ల మార్క్‌ను ధాటింది. ఆఖరి ఓవర్ రెండు సిక్స్‌లు బాదిన అనంతరం ఈ సంఖ్య 2.2 కోట్లకు చేరింది. ఇదే జియో సినిమాకు ఆల్‌టైమ్ రికార్డు కావడం గమనార్హం.

Here's Video

అంతకుముందు లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని కొట్టిన రెండు సిక్సర్లను లైవ్‌లో ఏకకాలంలో 1.7 కోట్ల మంది వీక్షించారు. ఇప్పటివరకు ఇదే అత్యధికం కాగా.. తాజా మ్యాచ్‌తో ఈ రికార్డు బద్దలు అయింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement