PBKS vs SRH Highlights: ఎట్టకేలకు ఉదయించిన సన్ రైజర్స్, సల్ప స్కోర్ల మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై 9 వికెట్ల విజయం; నేడు బెంగళూరు- రాజస్థాన్ మధ్య మ్యాచ్

ఒపెనర్లు డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో జట్టుకు శుభారంభాన్ని అందించారు. వార్నర్ 37 పరుగులకు ఔట్ అయినా, బెయిర్ స్టో (63 పరుగులు నాటౌట్) మరో బ్యాట్స్ మెన్ కేన్ విలియమ్సన్ (16 నాటౌట్) తో కలిసి లాంఛనాన్ని పూర్తి చేశాడు....

Sunrisers-Hyderabad | IPL 2021

Chennai, April 22: ఐపీఎల్ 2021లో భాగంగా బుధవారం చైన్నైలోని చెపాక్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్‌కు మధ్య జరిగిన మ్యాచ్‌లో ఎట్టకేలకు హైదరాబాద్ తొలి విజయాన్ని నమోదు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ జట్టు హైదరాబాద్ బౌలర్ల ధాటికి బెంబేలెత్తింది. హైదరాబాద్ జట్టు కట్టుదిట్టమైన బౌలింగ్, మెరుగైన ఫీల్డింగ్‌తో వరుసగా వికెట్లు కోల్పోయిన ప్రత్యర్థి జట్టు, ఏ దశలోనూ నిలకడ ప్రదర్శించలేదు. ఫలితంగా పంజాబ్ జట్టు 19.4 ఓవర్లలో 120 పరుగులకే ఆలౌట్ అయింది.

ఇక విజయలక్ష్యం స్పల్పంగా ఉండటంతో మ్యాచ్ మొదట్నించి హైదరాబాద్‌కే అనుకూలంగా ఏకపక్షంగా సాగింది. ఒపెనర్లు డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో జట్టుకు శుభారంభాన్ని అందించారు. వార్నర్ 37 పరుగులకు ఔట్ అయినా, బెయిర్ స్టో (63 పరుగులు నాటౌట్) మరో బ్యాట్స్ మెన్ కేన్ విలియమ్సన్ (16 నాటౌట్) తో కలిసి లాంఛనాన్ని పూర్తి చేశాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ 18.4 ఓవర్లలోనే 1 వికెట్ కోల్పోయి విజయానికి కావాల్సిన 121 స్కోరు చేసింది. దీంతో 9 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుపొందింది, ఈ సీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది.

స్కోర్లు: పంజాబ్ 19.4 ఓవర్లలో 120/ ఆలౌట్

హైదరాబాద్ 18.4 ఓవర్లలో 121/1

ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ జానీ బెయిర్ స్టో.

ఈ విజయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో 5వ స్థానంలోకి వెళ్లగా, వరుసగా మూడు పరాజయాలతో పంజాబ్ జట్టు అట్టడుగు స్థానానికి చేరుకొంది.

ఇదిలా ఉంటే గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు రాజస్థాన్ రాయల్స్ ఢీకొట్టనున్నాయి.

వేదిక: ముంబై - వాంఖడే స్టేడియం, రాత్రి 7:30 నుంచి మ్యాచ్ ప్రారంభం.