MI Retention List for IPL 2025: ముంబై ఇండియన్స్ రిటెయిన్ ఆటగాళ్ల జాబితా ఇదిగో, కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా, రూ.18 కోట్లతో జస్ప్రీత్ బుమ్రా, రూ.8 కోట్లతో తిలక్ వర్మ రిటెయిన్

ముంబై ఇండియన్స్ కూడా తమ రిటెయిన్ ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నమన్ ధీర్, జస్ప్రీత్ బుమ్రాలను అట్టిపెట్టుకుంది. ముంబై కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రాకు అవకాశం ఇవ్వొచ్చంటూ ఊహాగానాలు వెలువడినప్పటికీ హార్దిక్ పాండ్యానే కొనసాగించారు.

Jasprit Bumrah (Photo-X)

ఐపీఎల్ రిటెన్షన్ జాబితాలు వచ్చేశాయి. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు జట్లు అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాలను ఆయా ఫ్రాంచైజీలు నేడు ప్రకటించాయి. ముంబై ఇండియన్స్ కూడా తమ రిటెయిన్ ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నమన్ ధీర్, జస్ప్రీత్ బుమ్రాలను అట్టిపెట్టుకుంది. ముంబై కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రాకు అవకాశం ఇవ్వొచ్చంటూ ఊహాగానాలు వెలువడినప్పటికీ హార్దిక్ పాండ్యానే కొనసాగించారు.

స్టార్ ప్లేయర్లతో పాటు కెప్టెన్లను వదిలేసిన పలు ఫ్రాంచైజీలు, వేలంలో అదృష్టం పరీక్షించుకోనున్న ఆటగాళ్లు వీరే..

ఇక జట్టుని ఏకంగా ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను జట్టులో కొనసాగించారు. స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను కూడా ముంబై ఫ్రాంచైజీ వదులుకోలేదు. సూర్య, రోహిత్, హార్దిక్‌లను రూ.16.35 కోట్ల చొప్పున ముంబై ఫ్రాంచైజీ నిలుపుదల చేసుకుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను రూ.18 కోట్లతో రిటెయిన్ చేసుకోవడం ఏమంత ఆశ్చర్యంగా అనిపించలేదు. అయితే తిలక్ వర్మను ట్ల భారీ ధరకు రిటెయిన్ చేసుకోవడం ఆశ్చర్యం కలిగించింది.

జట్టు రిలీజ్ అయిన ఆటగాళ్లు వీళ్లే..

ఇషాన్ కిషన్, అర్జున్ టెండూల్కర్, కుమార్ కార్తికేయ, ఆకాశ్ మధ్వల్, నెహాల్ వధేరా, శామ్స్ ములానీ, విష్ణు వినోద్, పీయూష్ చావ్లా, శ్రేయాస్ గోపాల్, అన్షుల్ కాంబోజ్, శివాలిక్ శర్మ, డెవాల్డ్ బ్రీవిస్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, నువాన్ తుషారా, మహ్మద్ నబీ, గెరాల్డ్ కోట్జీ, క్వేనా మఫాకా, ల్యూక్ వుడ్.



సంబంధిత వార్తలు