MS Dhoni Record As Captain in IPL: అభిమానుల గుండెల్ని ముక్కలు చేస్తూ ముగిసిన ధోనీ స్వర్ణయుగం, రెండోసారి చెన్నై పగ్గాలను వదిలేశాడు, కొత్త కెప్టెన్‌గా రుతరాజ్ గైక్వాడ్, జార్ఖండ్‌ డైనమైట్‌ ఐపీఎల్ రికార్డు ఇదిగో..

ఆ జట్టు కెపెన్సీ బాధ్యతల నుంచి మహేంద్ర సింగ్‌ ధోనీ తప్పుకున్నాడు. మహి స్థానంలో రుతురాజ్‌ గైక్వాడ్‌ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ధోనీ ఐపీఎల్‌ ప్రారంభమైన 2008 నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టుకు కెప్టెన్‌గా కొనసాగుతూ వస్తున్నాడు.

MS Dhoni (Photo credit: Twitter @ChennaiIPL)

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టులో కీలక మార్పు చోటు చేసుకున్నది. ఆ జట్టు కెపెన్సీ బాధ్యతల నుంచి మహేంద్ర సింగ్‌ ధోనీ తప్పుకున్నాడు. మహి స్థానంలో రుతురాజ్‌ గైక్వాడ్‌ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ధోనీ ఐపీఎల్‌ ప్రారంభమైన 2008 నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టుకు కెప్టెన్‌గా కొనసాగుతూ వస్తున్నాడు.

మరే ఇతర జట్టుకు సాధ్యం కాని రీతిలో అత్యధికసార్లు చెన్నైని ఫైనల్‌కు చేర్చి.. ఏకంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన ఘనత మహేంద్ర సింగ్‌ ధోని సొంతం. టీమిండియా కెప్టెన్‌గా ఏకంగా మూడు ఐసీసీ ట్రోఫీలు అందుకున్నాడు ఈ జార్ఖండ్‌ డైనమైట్‌. క్యాష్‌ రిచ్‌ లీగ్‌ తొలి సీజన్‌లోనే చెన్నైని ఫైనల్‌కు చేర్చిన ఈ మిస్టర్‌ కూల్‌.. 2010, 2011, 2018, 2021, 2023 సీజన్లలో టైటిల్‌ అందించాడు. అంతేకాదు.. ధోని కెప్టెన్సీలో సీఎస్‌కే 2012, 2013, 2015, 2019లో రన్నరప్‌గానూ నిలిచింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా రుతురాజ్‌ గైక్వాడ్‌, ధోనీ సాధారణ ఆటగాడిగా అయినా కొనసాగుతాడా లేదా అనే దానిపై నడుస్తున్న చర్చలు

2013 స్పాట్‌ ఫిక్సింగ్‌ నేపథ్యంలో ఫ్రాంచైజీని సస్పెండ్‌ చేసిన మినహా మిగతా మిగతా అన్ని సీజన్లకు కెప్టెన్‌ సేవలందించాడు. 2022 సీజన్‌ ప్రారంభంలో రవీంద్ర జడేజాకు పగ్గాలు అప్పగించగా.. ఎనిమిది మ్యాచ్‌ల అనంతరం ధోనీ కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు. ఐపీఎల్‌ చెన్నై సట్టుకు 212 మ్యాచ్‌లకు నాయకత్వం వహించగా.. 128 మ్యాచ్‌లు గెలిచి.. 82 మ్యాచుల్లో ఓటమిపాలైంది.

MS Dhoni’s Captaincy Record in IPL (CSK + Pune)

Matches Played Won Loss No Result
226 133 91 2

MS Dhoni’s Record as CSK Captain in IPL

Matches Played Won Loss No Result
212 128 82 2

2023లో..41 ఏళ్ల వయసులో సీఎస్‌కేను ఐదోసారి చాంపియన్‌గా నిలబెట్టాడు. పెరుగుతున్న వయసు దృష్ట్యా.. భవిష్య కెప్టెన్‌ను తీర్చిదిద్దే క్రమంలో ఐపీఎల్‌-2024లో పూర్తిగా కెప్టెన్సీని వదిలేసి.. మహారాష్ట్ర క్రికెటర్‌, టీమిండియా ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ను తన స్థానంలో సారథిగా తీసుకువచ్చాడు.ఫ్రాంచైజీని ముందుకు నడిపించడానికి గైక్వాడ్ సరైన ఎంపిక, ముఖ్యంగా ధోని ఐపిఎల్‌లో తన చివరి సీజన్‌కి వెళుతున్నాడని ఖచ్చితమైన సూచన.

చాంపియన్స్ లీగ్ T20తో సహా అన్ని పోటీల్లో ఫ్రాంచైజీ ఆడిన 249 మ్యాచ్‌లలో 235 మ్యాచ్‌లలో ధోనీ CSK కెప్టెన్‌గా ఉన్నాడు. CSK మార్చి 22న చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో IPL 2024 ప్రారంభించనుంది.