Asia Cup 2023: భారత్ ఆసియా కప్ కోసం పాకిస్తాన్ రాకుంటే.. మా జట్టు ఆసియా కప్ బహిష్కరిస్తే రూ.25 కోట్లు నష్టపోతాం, పీసీబీ ఛైర్మెన్ నజామ్ సేథీ సంచలన వ్యాఖ్యలు
సెప్టెంబర్‌లో జరగనున్న ఆసియా కప్‌ను (Asia Cup) మా జట్టు బహిష్కరిస్తే పీసీబీ ఆదాయంలో మూడు అమెరికన్ మిలియన్ డాలర్లు(సుమారు రూ.25 కోట్ల రూపాయలు) నష్టపోతుందని తెలిపారు.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(PCB) ఛైర్మెన్ నజామ్ సేథీ (Najam Sethi) సంచలన వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్‌లో జరగనున్న ఆసియా కప్‌ను (Asia Cup) మా జట్టు బహిష్కరిస్తే పీసీబీ ఆదాయంలో మూడు అమెరికన్ మిలియన్ డాలర్లు(సుమారు రూ.25 కోట్ల రూపాయలు) నష్టపోతుందని తెలిపారు. మేము చేసిన ప్రతిపాదనకు ఒకవేళ ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) అంగీకరించకుంటే ఆసియాకప్‌ను బహిష్కరించేందుకు కూడా వెనుకాడమని.. దీనివల్ల కోట్ల రూపాయల నష్టం వచ్చినా భరించడానికి సిద్దంగా ఉన్నామని తెలిపారు.
తాము ప్రతిపాదించిన విధంగా ఆసియాకప్‌ను హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహిస్తే, భారత జట్టు(Team India) ఆఫ్‌షోర్ వేదికగా మ్యాచ్‌లు ఆడితే, అప్పుడు పాకిస్థాన్ మిగిలిన మ్యాచ్‌లకు స్వదేశంలో ఆతిథ్యం ఇస్తుందన్నారు. ఇది తప్ప తాము మరే ఇతర షెడ్యూల్‌ను అంగీకరించబోమని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ ఏడాది సెప్టెంబరులో జరగనున్న ఆసియాకప్‌కు పాకిస్థాన్ ఆతిథ్యమిస్తోంది.
టోర్నీ పాకిస్థాన్‌లో జరిగితే వెళ్లే ప్రసక్తే లేదని బీసీసీఐ ఇప్పటికే తేల్చి చెప్పేసింది. ఈ నేపథ్యంలో సేథీ హైబ్రిడ్ మోడల్‌ను ప్రతిపాదించారు. ఇండియా తన మ్యాచ్‌లను తటస్థ వేదికపై ఆడితే మిగిలిన మ్యాచ్‌ను పాక్ స్వదేశంలో నిర్వహిస్తుంది. అప్పుడు పాకిస్థాన్ ఆతిథ్య హక్కులను కోల్పోయే ప్రసక్తే ఉండదు.నిజానికి వారికి (భారత జట్టు) భద్రతపై భయం అవసరం లేదని, పాకిస్థాన్‌లో ఆడేందుకు వారి ప్రభుత్వం కనుక క్లియరెన్స్ ఇవ్వకుంటే అందుకు సంబంధించిన లిఖిత పూర్వక రుజువులను చూపాలని సేథీ డిమాండ్ చేశారు.
ఢిల్లీ కాపిటల్స్ జట్టుపై ముంబై ఇండియన్స్ సంచలన విజయం..రెండు ఓటముల తర్వాత బోణీ కొట్టిన రోహిత్ సేన
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ వంటి జట్లు పాకిస్థాన్‌లో ఎలాంటి సమస్యలు లేకుండా ఆడుతున్నప్పుడు పాకిస్థాన్‌లో భారత్ పర్యటనకు భద్రతా పరమైన ఎలాంటి ఆందోళన ఉండకూడదన్నారు. ఒకవేళ ఆసియా కప్‌కు మరో షెడ్యూల్‌ను ప్రకటిస్తే మేము ఒప్పుకోం. ఆసియా కప్‌ను బహిస్కరిస్తాం. ఇక దీనిపై బీసీసీఐ నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. అయితే తమ దేశంలో ఆసియాకప్ ఆడడానికి భద్రతాపరమైన కారణాలు చూపిస్తున్న బీసీసీఐ ఒక విషయంలో క్లారిటీ ఇస్తే బాగుంటుందని అన్నారు. మా దేశంలో భద్రత కరువయ్యిందని వారు ప్రూఫ్స్ చూపిస్తే బాగుండని తెలిపారు.
అయితే ఏసీసీలో 80 శాతం ఆదాయం పాకిస్తాన్, భారత్‌ల మ్యాచ్‌ల వల్లే వస్తుంది. ఒకవేళ మా ప్రతిపాదనకు బీసీసీఐ అంగీకరించకపోతే వచ్చే నష్టాన్ని భరించడానికి సిద్దంగా ఉన్నాం'' అని పేర్కొన్నారు.వన్డే ప్రపంచకప్‌లో ఆడేందుకు పాకిస్థాన్ నిరాకరించే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ఐసీసీతో సంబంధాలు భిన్నంగా ఉన్నాయన్నారు. అలాంటి పరిస్థితుల్లో సంబంధాలు ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు.
నజామ్ సేథీ వ్యాఖ్యలపై క్రికెట్ అభిమానులు వినూత్నంగా స్పందించారు. ''ఇంత మొండితనం పనికిరాదేమో.. నష్టం భరిస్తామనడం మంచి పద్దతి కాదు.. బీసీసీఐతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకుంటే మంచిది'' అంటూ హితబోధ చేశారు.