RR Vs SRH: ఉప్పల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పరువు గోవిందా..తొలి మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఘోర పరాజయం..

ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు 72 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.

IPL

ఐపీఎల్ 2023 నాలుగో మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య హైదరాబాద్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు 72 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. వాస్తవానికి ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హైదరాబాద్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 131 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో RR జట్టు 72 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది.