LSG vs RR: ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జైత్రయాత్ర, లక్నోపై గెలుపుతో ప్లే ఆఫ్స్ లో బెర్తుకు మరింత దగ్గరైన రాజస్థాన్
వరుసగా నాలుగో విజయం ఖాతాలో వేసుకుంది. తొలుత లక్నోను 200 లోపే కట్టడి చేసిన సంజూ సేన ఆ తర్వాత వీరకొట్టుడుతో జయభేరి మోగించింది. 197 టార్గెట్ ఛేదనలో ఓపెనర్లు యశస్వీ జైస్వాల్(24), జోస్ బట్లర్(34)లు మూడు బంతుల వ్యవధిలోనే పెవిలియన్ చేరారు.
Jaipur, April 27: టేబుల్ టాపర్ రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) జైత్రయాత్ర కొనసాగుతోంది. ఎనిమిదో విజయంతో ప్లే ఆఫ్స్ బెర్తుకు మరింత చేరువైంది. శనివారం లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) నిర్దేశించిన 197 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. టాపార్డర్ విఫలమైనా సంజూ శాంసన్(71 నాఔటట్) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. రాంచీ టెస్టు హీరో ధ్రువ్ జురెల్(52 నాటౌట్) మెరుపు బ్యాటింగ్‌తో అలరించాడు. యశ్ ఠాకూర్ ఓవర్లో సిక్సర్‌తో సంజూ జట్టును గెలిపించాడు. పదిహేడో సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ వరుసపెట్టి ప్రత్యర్థులకు చెక్ పెడుతోంది. వరుసగా నాలుగో విజయం ఖాతాలో వేసుకుంది. తొలుత లక్నోను 200 లోపే కట్టడి చేసిన సంజూ సేన ఆ తర్వాత వీరకొట్టుడుతో జయభేరి మోగించింది. 197 టార్గెట్ ఛేదనలో ఓపెనర్లు యశస్వీ జైస్వాల్(24), జోస్ బట్లర్(34)లు మూడు బంతుల వ్యవధిలోనే పెవిలియన్ చేరారు. 60 పరుగులకు రెండు కీలక వికెట్లు పడగా.. దంచేస్తాడనుకున్న ఇంప్యాక్ట్ ప్లేయర్ రియాన్ పరాగ్(14) ఉసూరుమనిపించాడు. అప్పటికీ 78 కే మూడు వికెట్లు. ఆ దశలో కెప్టెన్ సంజూ శాంసన్(71 నాటౌట్), ధ్రువ్ జురెల్ (52 నాటౌట్)తో ఇన్నింగ్స్ నిర్మించాడు.
మొహ్సిన్ ఖాన్ వేసిన ఓవర్లో జురెల్ రెచ్చిపోయాడు. యశ్ ఠాకూర్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన అతడు.. వరుసగా 4, 6, 4, 4 బాదాడు. ఆ తర్వాత సంజూ తన వంతు అన్నట్టు సిక్సర్లు, ఫోర్లతో విజృంభించాడు. దాంతో కొండంత లక్ష్యం కాస్త రవ్వంత అయింది. లక్నో కెప్టెన్ బౌలర్లను మార్చినా.. ఈ ఇద్దరూ పట్టువదలని యోధుల్లా ఆడారు. నాలుగో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యంతో లక్నోకు ఓటమి అంచుల్లోకి నెట్టాడు. 19వ ఓవర్‌లో వరుసగా సిక్స్, ఫోర్ బాదడంతో 7 వికెట్లతో గెలుపొందిన రాజస్థాన్ ఛేజింగ్‌లో తమకు తిరుగులేదని మరోసారి నిరూపించింది.