Rohit Sharma Kisses Hardik Pandya: భారత్ జగజ్జేతగా నిలిచిన శుభవేళ.. భావోద్వేగ దృశ్యాలు.. హార్దిక్ పాండ్యాను ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్న రోహిత్ శ‌ర్మ.. వీడియో ఇదిగో

దక్షిణాఫ్రికాను ఓడించి భారత జట్టు T20 ప్రపంచ కప్‌ ను మరోసారి గెలుచుకుని జగజ్జేతగా నిలిచింది. ఊరూ-వాడా, పిల్లా-జల్లా అని తేడా లేకుండా ప్రతీ భారతీయుడు ఈ మధుర విజయ క్షణాలను ఆస్వాదిస్తున్నారు.

Rohit Sharma kisses Hardik Pandya (Credits: X)

Newdelhi, June 30: దక్షిణాఫ్రికాను (South Africa) ఓడించి భారత (India Team) జట్టు T20 ప్రపంచ కప్‌ (T20 World Cup) ను మరోసారి గెలుచుకుని జగజ్జేతగా నిలిచింది. ఊరూ-వాడా, పిల్లా-జల్లా అని తేడా లేకుండా ప్రతీ భారతీయుడు ఈ మధుర విజయ క్షణాలను ఆస్వాదిస్తున్నారు.  2007 తొలిసారి టీమిండియా ధోనీ కెప్టెన్సీలో టీ 20 వరల్డ్ కప్ గెలిచింది. ఇప్పుడు 2024లో రెండో సారి రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా వరల్డ్ కప్ గెలుచుకుంది. భార‌త్ ఛాంపియ‌న్ గా నిలిచిన త‌ర్వాత‌ కెప్టెన్ రోహిత్ శర్మ , ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మధ్య ఎమోషనల్ మూమెంట్స్ క‌నిపించాయి.

టీ 20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత్...బార్బడోస్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికాపై విజయం...

ఆప్యాయతతో ముద్దు

మ్యాచ్ ముగిసిన తర్వాత మాట్లాడుతున్న ఆల్‌ రౌండర్ హార్దిక్ కు భారత కెప్టెన్ రోహిత్ ఎంతో ఆప్యాయంగా ముద్దు ఇచ్చాడు. అలాగే, మ్యాచ్ లో వీరిద్ద‌రూ ఎమోష‌న‌ల్ అవుతూ క‌న్నీళ్లు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.

వాక్ స్వాతంత్య్రం పేరుతో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తానంటే కుదరదు, దానికి పరిమితి ఉంటుందని అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement