SRH vs RCB Highlights: గెలిచే మ్యాచ్ ఓడిపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్, 6 పరుగుల తేడాతో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ అద్భుత విజయం, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి బెంగళూరు, నేడు రాజస్థాన్ మరియు దిల్లీ మధ్య మ్యాచ్

ఆడిన రెండు మ్యాచ్ లు గెలుపొందిన ఆర్‌సిబి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకగా, వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిన సన్‌రైజర్స్ 7వ స్థానానికి దిగజారింది....

SRH vs RCB | Photo: Vivo IPL 2021

Chennai, April 15: బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ (ఐపిఎల్) 2021 లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో బెంగళూరు అద్భుత విజయాన్ని సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు జట్టు హైదరాబాద్ బౌలర్ల ధాటికి తడబడింది. అయితే చివరి వరకు క్రీజులో ఉన్న గ్లెన్ మాక్స్ వెల్ 41 బంతుల్లో 59 పరుగులు చేసి జట్టులో టాప్ స్కోరర్ గా నిలవడమే కాకుండా బెంగళూరు జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందివ్వడంలో తన అనుభవాన్ని ఉపయోగించాడు. ఆర్‌సిబి కెప్టెన్ కోహ్లీ కూడా 33 పరుగులతో రాణించడంతో బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేయగలిగింది.

150 పరుగుల స్వల్ప లక్ష్యంతో రన్ ఛేజ్ ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆరంభంలోనే ఒపెనర్ వృద్ధిమాన్ సాహా 1 పరుగు మాత్రమే చేసి ఔట్ అయినా, మరో ఓపెనర్- ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మాత్రం 37 బంతుల్లో హాఫ్ సెంచరీ (54) పరుగులతో తన ఫామ్ కొనసాగించాడు. వార్నర్ కు మనీష్ పాండే (38) కూడా తోడవడంతో ఎస్‌ఆర్‌హెచ్ 13 ఓవర్లలో 96/1 స్కోరుతో పటిష్ఠ స్థితిలో నిలిచింది. ఇక సునాయసంగా గెలుపు వైపు పయనిస్తుందనుకుంటున్న దశలో అనూహ్యంగా బోల్తా కొట్టింది. ఆర్‌సిబి స్పినర్ షాబాజ్ అహ్మద్ ఒకే ఓవర్లో 3 కీలక వికెట్లు పడగొట్టడంతో అంచనాలు తలకిందులయ్యాయి. ఆ తర్వాత వికెట్లు వరుసగా పడుతూ వచ్చాయి, చివర్లో రషీద్ ఖాన్ బ్యాట్ 1 సిక్స్, 1 ఫోర్ తో బ్యాట్ ఝులింపిచేటట్లు కనిపించినా 17 పరుగుల వద్ద రనౌట్ గా వెనుదిరిగాడు. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో చివరకు హైదరాబాద్ కు అపజయమే వరించింది. ఎస్‌ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 6 పరుగులతో విజయం సాధించింది. ఆర్‌సిబి బ్యాట్స్ మెన్ గ్లెన్ మాక్స్ వెల్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు.

ఆడిన రెండు మ్యాచ్ లు గెలుపొందిన ఆర్‌సిబి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకగా, వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిన సన్‌రైజర్స్ 7వ స్థానానికి దిగజారింది.

ఇదిలా ఉంటే, ఈరోజు రాజస్థాన్ రాయల్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ముంబై వాంఖడే స్టేడియంలో రాత్రి 7:30 సమయానికి మ్యాచ్ ప్రారంభం కానుంది.



సంబంధిత వార్తలు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif