Sachin Tendulkar Will Get Lifetime Achievement Award: సచిన్ టెండూల్కర్‌కు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డ్‌, బీసీసీఐ వార్షిక కార్యక్రమంలో అందించే ఏర్పాట్లు

టీమిండియా దిగ్గజ క్రికెటర్‌, మాజీ కెప్టెన్‌ సచిన్‌ టెండూల్కర్‌కు (Sachin Tendulkar) బీసీసీఐ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును (Lifetime Achievement Award) ప్రకటించింది. శనివారం బీసీసీఐ వార్షిక కార్యక్రమంలో సచిన్‌ను అవార్డుతో సత్కరించనున్నది. సీకే నాయుడు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుకు సచిన్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

Sachin (File: Twitter)

Mumbai, JAN 31: టీమిండియా దిగ్గజ క్రికెటర్‌, మాజీ కెప్టెన్‌ సచిన్‌ టెండూల్కర్‌కు (Sachin Tendulkar) బీసీసీఐ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును (Lifetime Achievement Award) ప్రకటించింది. శనివారం బీసీసీఐ వార్షిక కార్యక్రమంలో సచిన్‌ను అవార్డుతో సత్కరించనున్నది. సీకే నాయుడు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుకు సచిన్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. భారత క్రికెట్‌కు దిగ్గజ ఆటగాడు అందించిన సేవలు అమోఘమని పేర్కొన్నాయి. ఈ పురస్కారాన్ని స్వీకరించనున్న 31వ ఆటగాడు సచిన్‌ టెండూల్కర్‌ కావడం విశేషం. గతంలో మాజీ హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి, లెజెండరీ వికెట్‌ కీపర్‌ ఫరూక్‌ ఇంజినీర్‌ సహా పలువురు ఈ అవార్డును అందుకున్నారు. 1994లో భారత జట్టు తొలి కెప్టెన్‌ కర్నల్‌ సీకే నాయుడు గౌరవార్థం ఈ అవార్డును బీసీసీఐ తీసుకువచ్చింది. సీకే నాయుడు 1916 నుంచి 1963 వరకు సుదీర్ఘంగా 47 సంవత్సరాల పాటు ఫస్ట్‌క్లాస్‌లో కొనసాగారు. ఇది ప్రపంచ రికార్డు కావడం విశేషం.

U19 T20 Women World Cup: ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్... సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్ చిత్తు, 9 వికెట్ల తేడాతో గెలుపొందిన భారత్ 

ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ అత్యధిక పరుగులు చేసిన ఏకైక ఆటగాడు సచిన్‌ (Sachin Tendulkar). సెంచరీల్లోనూ సెంచరీ కొట్టిన ఏకైక ఆటగాడు. టెస్ట్ క్రికెట్‌తో పాటు, వన్డే ఫార్మాట్‌లోనూ సచిన్ అనేక రికార్డులు నెలకొల్పాడు. అతను వన్డేల్లో 44.83 సగటుతో 18,426 పరుగులు చేయగా.. ఇందులో 49 సెంచరీలు, 96 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక టెస్ట్‌ల్లో 53.78 సగటుతో 15,921 పరుగులు చేశాడు. ఇందులో 51 సెంచరీలు, 68 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తన కెరియర్‌లో కేవలం ఒకే ఒక టీ20 ఇంటర్నేషనల్‌ మ్యాచ్ ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు ఆటగాడు సచిన్‌ టెండూల్కర్‌. భారత్‌ తరఫున మొత్తం 664 మ్యాచ్‌లు ఆడాడు. 48.52 సగటుతో 34,357 పరుగులు చేశాడు. వీటిలో 100 సెంచరీలు, 164 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Trisha Gongadi: ప్రపంచ రికార్డు నెలకొల్పిన తెలుగుమ్మాయి గొంగడి త్రిష, అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్‌లో మెరుపు సెంచరీ, తొలి సెంచరీ చేసిన బ్యాటర్‌గా గుర్తింపు  

సచిన్‌ కేవలం అద్భుతంగా పరుగులు సాధించడమే కాకుండా క్రికెట్‌కు ఐకాన్‌గా మారాడు. 1989లో 16 సంవత్సరాల వయసులో పాకిస్తాన్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. రెండు దశాబ్దాల పాటు భారత జట్టుకు విశేష సేవలు అందించాడు. 2011లో వరల్డ్‌ కప్‌ గెలిచిన జట్టులో సచిన్‌ సభ్యుడు కాగా.. కప్‌ని గెలువడంలోనూ తన వంతు పాత్ర పోషించాడు. సచిన్‌ తన బ్యాట్‌తో ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ బౌలర్లు సైతం వణికించాడు. దివంగత షేన్ వార్న్ నుంచి ముత్తయ్య మురళీధరన్ వరకు అందరూ సచిన్‌ను ప్రశంసించారు. ఏ సమయంలోనైనా మ్యాచ్‌ గమనాన్ని మార్చగల సత్తా సచిన్లో ఉందని చెప్పారు. అలాగే, పలువురు ప్రముఖ బౌలర్లు సైతం సచిన్‌కు బౌలింగ్‌ చేయడం కష్టమని పనిగా చెప్పారు. పోటీ జట్లు సచిన్‌ను అవుట్‌ చేసేందుకు ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించేవి. అవార్డుకు ఎంపికైన సచిన్‌ టెండూల్కర్‌కు పలువురు క్రికెటర్లతో పాటు అభిమానులు సైతం సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement