Trisha Gongadi: ప్రపంచ రికార్డు నెలకొల్పిన తెలుగుమ్మాయి గొంగడి త్రిష, అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్‌లో మెరుపు సెంచరీ, తొలి సెంచరీ చేసిన బ్యాటర్‌గా గుర్తింపు
కౌలాలంపూర్‌లో జరుగుతున్న అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా జోరు కొనసాగుతోంది. స్కాట్లాండ్ తో మ్యాచ్ లో టీమిండియా 20 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 208 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. తెలుగమ్మాయి గొంగడి త్రిష మెరుపు సెంచరీతో వరల్డ్ రికార్డు సృష్టించింది.
కౌలాలంపూర్‌లో జరుగుతున్న అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా జోరు కొనసాగుతోంది. స్కాట్లాండ్ తో మ్యాచ్ లో టీమిండియా 20 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 208 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. తెలుగమ్మాయి గొంగడి త్రిష మెరుపు సెంచరీతో వరల్డ్ రికార్డు సృష్టించింది. త్రిష టీ20 అండర్-19 వరల్డ్ కప్ చరిత్రలోనే తొలి సెంచరీ సాధించిన బ్యాటర్ గా నిలిచింది.
తెలంగాణలోని భద్రాచలంకు చెందిన త్రిష నేటి మ్యాచ్ లో 53 బంతుల్లో సెంచరీ సాధించింది. త్రిష మొత్తం 59 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 4 సిక్సులతో అజేయంగా 110 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో త్రిష ఓపెనర్ గా బరిలో దిగింది.మరో ఓపెనర్ కమలిని 42 బంతుల్లో 9 ఫోర్లతో 51 పరుగులు చేసింది. ఈ టోర్నీలో టీమిండియా అమ్మాయిలు ఇప్పటికే సెమీస్ చేరుకున్నారు. ఇవాళ స్కాట్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ సూపర్ సిక్స్ దశలో చివరిది. 209 పరుగుల లక్ష్యఛేదనలో స్కాట్లాండ్ విలవిల్లాడుతోంది. 10 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్లు చేజార్చుకుని 43 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ఆయుషి శుక్లా 3, వైష్ణవి శర్మ 3 వికెట్లు తీశారు.
Trisha Gongadi from Bhadrachalam becomes first player to score century in Women’s U19 T20 World Cup
Trisha Gongadi etches her name in the record books with the first-ever century in Women's #U19WorldCup history 🤩
➡️ https://t.co/t2l4pLxYCq pic.twitter.com/mdmKWXi2YG
— T20 World Cup (@T20WorldCup) January 28, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 28, 2025 04:57 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

