India players celebrating. (Photo credits: X/BCCI)

Dubai, FEB 23: చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాకిస్తాన్ పై భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదిక‌గా పాకిస్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో భార‌త్ గెలుపొందింది. విరాట్ కోహ్లీ (100 నాటౌట్; 111 బంతుల్లో 7 ఫోర్లు) శ‌త‌కంతో చెల‌రేగ‌డంతో 242 ప‌రుగుల ల‌క్ష్యాన్ని భార‌త్ 42.3 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజ‌యంతో భార‌త్ సెమీస్ అవ‌కాశాలు మ‌రింత మెరుగు అయ్యాయి. పాకిస్తాన్ టోర్నీ నుంచి దాదాపుగా నిష్ర్క‌మించింది. శ్రేయ‌స్ అయ్య‌ర్ (56; 67 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌) హాఫ్ సెంచ‌రీ చేశాడు. శుభ్‌మ‌న్ గిల్ (46; 52 బంతుల్లో 7 ఫోర్లు) రాణించాడు. రోహిత్ శ‌ర్మ (20) ఫ‌ర్వాలేద‌నిపించాడు. పాకిస్తాన్ బౌల‌ర్ల‌లో అబ్రార్ అహ్మద్, షాహీన్ అఫ్రిది, ఖుష్‌దిల్ షా లు త‌లా ఓ వికెట్ సాధించారు.

Virat Kohli World Record: పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో వరల్డ్‌ రికార్డ్ బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ, ఇప్పటి వరకు ఏ క్రికెటర్‌కు సాధ్యం కాని పరుగుల రికార్డు సొంతం 

తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్‌ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆల్‌ అవుట్‌ అయ్యింది. టీమిండియా 242 పరుగుల టార్గెట్‌తో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. తొలి బంతిని కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఎదుర్కోగా.. పాకిస్తాన్‌ బౌలర్‌ షాహిన్‌ ఆఫ్రిది బౌలింగ్‌కు వచ్చాడు. అంతకు ముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్తాన్‌ 241 పరుగులకే కుప్పకూలింది. వన్డేల్లో వరుసగా ఐదో మ్యాచ్‌లో భారత్ ప్రత్యర్థి జట్టును 50 ఓవర్లలోపే ఆలౌట్ చేసింది. పాక్ బ్యాట‌ర్ల‌లో సౌద్ ష‌కీల్ ( 62; 76 బంతుల్లో 5 ఫోర్లు) అర్థ‌శ‌తకం సాధించాడు. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (46; 77 బంతుల్లో 3 ఫోర్లు), ఖుష్‌దిల్ షా (38) లు రాణించ‌గా బాబ‌ర్ ఆజామ్ (23)లు ఫ‌ర్వాలేద‌నిపించారు.

India Beat Pakistan by Six Wickets

 

ఇమామ్ ఉల్ హ‌క్ (10), ఆఘా స‌ల్మాన్ (19), తయ్యబ్ తాహిర్ (4)లు విఫ‌లం అయ్యారు. భార‌త బౌల‌ర్ల‌లో కుల్దీప్ యాద‌వ్ మూడు వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. అక్ష‌ర్ ప‌టేల్‌, ర‌వీంద్ర జ‌డేజా, హ‌ర్షిత్ రాణాలు త‌లా ఓ వికెట్ సాధించారు.