Bandi Sanjay (Photo-X)

Hyd, Jan 27: తెలంగాణలో మరో​సారి రాజకీయం వేడెక్కింది. రాష్ట్రంలో పద్మ అవార్డుల ప్రకటనపై బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఒకరిపై మరోకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్‌, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వం పేర్లనే రాష్ట్రాలు కూడా పెట్టాలని కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఖర్చయ్యే సంక్షేమ పథకాలకు ఎవరి పేరు పెట్టుకున్నా తమకు అభ్యంతరం లేదని.. కాంగ్రెస్‌కు నచ్చితే ఒసామా బిన్ లాడెన్, దావూద్ ఇబ్రహీం పేర్లు పెట్టుకున్నా అభ్యంతరం లేదంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు.

వీడియో ఇదిగో, ప్రధాని మోదీని గజనీ మహమూద్‌తో పోల్చిన సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీని గెలిపించాలని వినతి

నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఇందిరమ్మ పేరు ఎలా పెడతారని ప్రశ్నించారు. రేషన్‌ ఇచ్చేది కేంద్రమైతే రాష్ట్ర ప్రభుత్వం ఫొటో ఎందుకు పెడుతున్నారన్నారు. పేదల ఇళ్ల కోసం కాకుండా పేర్ల కోసం కాంగ్రెస్‌ నేతలు పాకులాడుతున్నారని (Padma Awards Controversy in Telangana) విమర్శించారు. ఇస్తామన్న ఆరు గ్యారంటీలు ఇంకా ఎందుకు అమలు చేయట్లేదని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రగతికి సహకరిస్తోంది.

Here's Bandi Sanjay Statement

బండి సంజయ్ కు కౌంటర్ గా ఎదురుదాడికి దిగిన కాంగ్రెస్..

రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల పేర్లను మార్చేస్తోంది. మాకు ఎలాంటి భేషజాలు లేవు.. కేంద్రం, రాష్ట్రం కలిస్తేనే అభివృద్ధి. పద్మ అవార్డులు స్థాయి ఉన్న వారికి ఇస్తాం. గద్దర్‌కు అవార్డు ఎలా ఇస్తాం? బీజేపీ కార్యకర్తలను, పోలీసులను చంపిన వారికి అవార్డులు ఎలా ఇస్తాం. తెలంగాణ సెంటిమెంట్‌తో లాభపడింది ఎవరో ప్రజలకు తెలుసు’’ అని బండి సంజయ్‌ అన్నారు.

Congress Slams Bandi Sanjay Statement

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, గరీబ్ కళ్యాణ్ యోజన వంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా కేంద్రమే నేరుగా ప్రజలకే అందిస్తుందన్నారు. పరిస్థితి అంత వరకు తీసుకురావొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. సంక్షేమ పథకాల అమలు విషయంలో పేదలకు ఎట్టి పరిస్థితిల్లోనూ తాము అన్యాయం చేయబోమని స్పష్టం చేశారు. ప్రజలందరికీ ఉచితంగా బియ్యం కేంద్రమే ఇస్తోంది కదా... గరీబ్ కళ్యాణ్ యోజన అని పేరు పెడితే తప్పేంది? ప్రధాని ఫోటో ఎందుకు పెట్టరు అని ప్రశ్నించారు.

అభివృద్ధి విషయంలో కేంద్రం పూర్తిగా సహకరిస్తోందన్నారు. గత 10 ఏళ్లలో రూ.12 లక్షల కోట్లకుపైగా కేంద్రం ఖర్చు చేసిందని తెలిపారు. గ్రామాల్లో జరిగిన అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనే అని స్పష్టం చేశారు. రైతు భరోసా, కమ్యూనిటీ హాల్, స్మశాన వాటిక, వీధి దీపాలు, రోడ్ల పైసలన్నీ కేంద్ర ప్రభుత్వానివే అని తెలిపారు.

బండి సంజయ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేతలు కౌంటరిచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇస్తున్న పథకాలకు ఇందిరమ్మ పేరు పెడితే తప్పేంటని ప్రశ్నించారు. అలాగే, నక్సలైట్లకు ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వొచ్చు కానీ.. పద్మ అవార్డులు ఇవ్వడానికి పనికి రారా? అని ప్రశ్నలు సంధించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ..‘బండి సంజయ్ వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి. పథకాలకు ఇందిరమ్మ పేరు పెడితే తప్పేంటి?. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తిని పద్మా అవార్డులకు ప్రతిపాదిస్తే తప్పా. నక్సలైట్ భావజాలం అయితే అవార్డులు ఇవ్వరా?. మావోయిస్టులకు ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్‌లు ఇవ్వొచ్చు కానీ, పద్మా అవార్డులకు పనికి రారా?.

లెఫ్ట్ భావజాలం ఉన్న ఈటల రాజేందర్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికోసం ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అంటే ఈటల కూడా బీజేపీ అధ్యక్ష పదవికి అనర్హుడా?. ఈ విషయం బండి సంజయ్ చెప్పాలి. బండి సంజయ్ వ్యాఖ్యలు గద్దర్‌ను అవమానిస్తున్నట్లు ఉన్నాయి. గతంలో ప్రగతి భవన్ ముందు గద్దర్‌ను నిలబెట్టి కేసీఆర్ అవమానిస్తే.. ఇప్పుడు పద్మా అవార్డుల విషయంలో బండి సంజయ్ అవమానిస్తున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు.

ఇక ఎంపీ చామల కిరణ్‌ మీడియాతో మాట్లాడుతూ..‘గద్దర్ భావజాలానికి సంబంధించి బండి సంజయ్ మాట్లాడటం హాస్యాస్పదం. బీజేపీ భావజాలం ఉన్నవారికి మాత్రమే అవార్డ్ ఇస్తారా?. గద్దర్ అణగారిన వర్గాల కోసం పోరాటం చేసిన వ్యక్తి. బీజేపీ పాట పాడిన వారు.. బీజేపీ గొంతు పలికిన వారికి ఇకపై అన్నీ అన్నట్టు బండి సంజయ్ మాటలు ఉన్నాయి. గద్దర్‌పై బండి సంజయ్ మాట్లాడిన మాటలను విత్ డ్రా చేసుకోవాలి అని కామెంట్స్‌ చేశారు.

గద్దర్ పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో నాంపల్లి(Nampally) బీజేపీ కార్యాలయం(BJP Office) వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. కాంగ్రెస్ కార్యకర్తలు(Congress Supporters) బండి సంజయ్(Bandi Sanjay) దిష్టిబొమ్మ దహనం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టిడించేందుకు ప్రయత్నించారు. బీజేపీ, బండి సంజయ్ లకు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ.. గాంధీభవన్(Gandhi Bhavan) వద్ద నుంచి బయలుదేరారు. గద్దరన్న అమర్ రహే, బండి సంజయ్ డౌన్ డౌన్, కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. బీజేపీ కార్యాలయం వైపు వెళుతున్న కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

పద్మ అవార్డుల(Padma Awards) వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి(CM Reavnth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు(Deputy CM Bhatti Vikramarka Mallu) స్పందిస్తూ.. కేంద్రం పద్మ అవార్డుల ప్రకటలో ఫెడరల్ స్పూర్తికి బిన్నంగా వ్యవహరించిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే ఇతర కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన వారిలో ఒక్కరికి కూడా పద్మ అవార్డులు ప్రకటించలేదని అసహనం వ్యక్తం చేశారు.