U19 T20 Women World Cup: ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్... సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్ చిత్తు, 9 వికెట్ల తేడాతో గెలుపొందిన భారత్

అండర్ 19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో(U19 T20 Women World Cup) భారత్‌ సత్తా చాటింది. సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించి ఫైనల్‌కు చేరింది(Ind W Vs Eng W).

U19 T20 Women World Cup: ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్... సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్ చిత్తు, 9 వికెట్ల తేడాతో గెలుపొందిన భారత్
India Women's U-19 Team enters T20 World Cup Final(X)

అండర్ 19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో(U19 T20 Women World Cup) భారత్‌ సత్తా చాటింది. సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించి ఫైనల్‌కు చేరింది(Ind W Vs Eng W). ఇంగ్లండ్ విధించిన 114 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15 ఓవర్లలోనే చేధించింది. కేవలం ఒకే ఒక వికెట్‌ను కోల్పోయి 117 పరుగులు చేసి విజయ కేతనం ఎగురవేసింది. కమలిని (56*), త్రిష (35) రన్స్ చేశారు.

ఇక అంతకముందు తొలుత టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఇంగ్లండ్‌ను భారీ స్కోరు చేయకుండా అడ్డుకోవడంలో భారత బౌలర్ల సఫలమయ్యారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో కెప్టెన్ అబి నోర్‌గ్రోవ్‌ (30), డేవినా పెరిన్ (45), అము సురేన్‌ కుమార్ (14) పరుగులు చేయగా భారత బౌలర్లలో ఆయుషి శుక్లా (2/21),వైష్ణవి శర్మ (3/23), పరునిక సిసోదియా (3/21) రాణించారు.   ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వద్ద తొక్కిసలాట.. కోహ్లీని చూసేందుకు బారీగా తరలివచ్చిన అభిమానులు, పలువురికి గాయాలు, వీడియో

India Women's U-19 Team enters T20 World Cup Final

 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 31, 2025 04:16 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).