Smriti Mandhana Century: సరికొత్త చరిత్ర సృష్టించిన టీమిండియా బ్యాట్స్ ఉమెన్ స్మృతి మంధాన, సౌతాఫ్రికాతో వన్డేలో సెంచరీ చేసి కొత్త రికార్డు
వన్డేల్లో ఆరో సెంచరీతో 7 వేల పరుగుల క్లబ్‌లో చేరింది. దాంతో, ఈ ఫీట్ సాధించిన రెండో మహిళా క్రికెటర్‌గా మంధాన రికార్డు నెలకొల్పింది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డేలో 56 పరుగుల వద్ద భారత వైస్ కెప్టెన్ అంతర్జాతీయ క్రికెట్‌లో 7,000 పరుగుల మైలురాయికి చేరింది.
South Africa, June 16: భారత మహిళా జట్టు ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana) చరిత్ర సృష్టించింది. వన్డేల్లో ఆరో సెంచరీతో 7 వేల పరుగుల క్లబ్‌లో చేరింది. దాంతో, ఈ ఫీట్ సాధించిన రెండో మహిళా క్రికెటర్‌గా మంధాన రికార్డు నెలకొల్పింది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డేలో 56 పరుగుల వద్ద భారత వైస్ కెప్టెన్ అంతర్జాతీయ క్రికెట్‌లో 7,000 పరుగుల మైలురాయికి చేరింది. తద్వారా మాజీ కెప్టెన్ మిధాలీ రాజ్(Mithali Raj) తర్వాత ఈ ఘనత సొంతం చేసుకున్న ప్లేయర్‌గా మంధాన చరిత్ర పుటల్లో నిలిచింది.
మిధాలీ 10,868 పరుగులతో టాప్‌లో కొనసాగుతోంది. చిన్నస్వామి స్టేడియంలో సఫారీ పేసర్ల ధాటికి టాపార్డర్ కుప్పకూలగా.. కష్టమైన పరిస్థితుల్లో ఖతర్నాక్ ఇన్నింగ్స్ ఆడింది. దక్షిణాఫ్రికా బైలింగ్ దళాన్ని దీటుగా ఎదుర్కొన్న మంధాన శతక్కొట్టింది. విధ్వంసక ఇన్నింగ్స్‌తో మెరుపు సెంచరీ బాదింది.
ఒకదశలో 53 పరుగులకే మూడు వికెట్లు పడినా ఒత్తిడికి లోనవ్వని ఆమె దీప్తి శర్మ(37)తో కీలక భాగస్వామ్యం నెలకొల్పింది. 127 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 117 రన్స్ బాదిన మంధాన జట్టుకు భారీ స్కోర్ అందించింది. మహిళల ప్రీమియర్ లీగ్‌లో బెంగళూరు (RCB) ట్రోఫీ కరువు తీర్చిన మంధాన జాతీయ జట్టు తరఫున మరో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడింది.