WI Vs ENG: టీ20లో విండీస్ సంచలనం, 219 పరుగుల భారీ టార్గెట్‌ను చేధించిన వెస్టిండీస్, సిరీస్ కొల్పోయిన గ్రాండ్ విక్టరీతో కరేబియన్ జట్టుకు ఓదార్పునిచ్చిన బ్యాట్స్‌మెన్
ఇంగ్లాండ్ విధించిన 219 పరుగుల లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలి ఉండగానే చేధించి ఔరా అనిపించింది. ఓపెనర్లు ఎవిన్ లెవిస్(68), షాయ్ హోప్(54)లు 9.1 ఓవర్లలోనే 136 పరుగులు జోడించి జట్టు విజయానికి పునాది వేశారు.
Hyd, Nov 17: స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ 20 సిరీస్‌ను కొల్పోయిన చివరి మ్యాచ్‌లో గ్రాండ్ విక్టరీ కొట్టింది వెస్టిండీస్. ఇంగ్లాండ్ విధించిన 219 పరుగుల లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలి ఉండగానే చేధించి ఔరా అనిపించింది. ఓపెనర్లు ఎవిన్ లెవిస్(68), షాయ్ హోప్(54)లు 9.1 ఓవర్లలోనే 136 పరుగులు జోడించి జట్టు విజయానికి పునాది వేశారు.
వీరిద్దరూ ఔటైనా కెప్టెన్ రొవ్‌మన్ పావెల్(38), ఆల్‌రౌండర్ షెర్ఫానే రూథర్‌ఫొర్డ్(29 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు.దీంతో మరో ఓవర్ మిగిలి ఉండగానే ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది విండీస్. లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ ఓటమిని తట్టుకోలేక టీవీని బద్దలు కొట్టిన అభిమాని.. అసలేమైంది? (వీడియో)
Here's Tweet:
తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కొల్పోయి 218 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్(55), విల్ జాక్స్(25), కెప్టెన్ జోస్ బట్లర్(38), జాకబ్ బెథెల్(62)లు రాణించడంతో ఇంగ్లాండ్ భారీ స్కోరు సాధించింది. ఈ మ్యాచ్‌లో ఓడిపోయినా నాలుగు టీ20ల సిరీస్‌ను ఇంగ్లాండ్ 3-1 తేడాతో గెలుపొందింది.