T20 World Cup 2024 Squads: టీ20 వరల్డ్ కప్ కోసం తమ జట్లను ప్రకటించిన అన్ని దేశాలు, జూన్ 1 నుంచి 29వ తేదీ వరకు ఐసీసీ 2024 టీ20 వరల్డ్‌కప్
ఈ టోర్నీ జూన్ 1 నుంచి 29వ తేదీ వరకు జరగనుంది. ఇవాళ్టితో ఈ టోర్నీలో పాల్గొనే 20 జట్లు తమ స్వాడ్స్‌ను ప్రకటించడానికి గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే భారత్ సహా పలు దేశాలు తమ జట్లను ప్రకటించాయి.
వెస్టిండీస్, అమెరికాలో వచ్చే నెల నుంచి జరుగనున్న టీ20 వరల్డ్‌కప్ కోసం అన్ని జట్లు తమ స్క్వాడ్‌ను ప్రకటించాయి. ఈ టోర్నీ జూన్ 1 నుంచి 29వ తేదీ వరకు జరగనుంది. ఇవాళ్టితో ఈ టోర్నీలో పాల్గొనే 20 జట్లు తమ స్వాడ్స్‌ను ప్రకటించడానికి గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే భారత్ సహా పలు దేశాలు తమ జట్లను ప్రకటించాయి. కాగా, ప్రకటించిన స్క్వాడ్‌లలో మార్పులు చేసుకునేందుకు ఈ నెల 25వ తేదీ వరకు అవకాశం ఉంది.
ఇక ఈసారి 20 జట్లు, 5 గ్రూపులుగా విడిపోయి తలపడనున్నాయి. ఈ 20 జట్ల నుంచి ఎనిమిది సూపర్ 8కు చేరుకుంటాయి. అక్కడ నాలుగు జట్లు, రెండు గ్రూపులుగా ఏర్పడి సెమీస్ బెర్త్ కోసం పోటీ పడతాయి. ఈ ఎనిమిది జట్ల నుంచి నాలుగు సెమీ ఫైనల్ కు వెళ్తాయి. సెమీఫైనల్ చేరిన నాలుగ జట్లలో రెండు జట్లు ఫైనల్ చేరుకుంటాయి. ఆ రెండింటింలో ఓ జట్టు విశ్వవిజేతగా నిలుస్తుంది. ఇప్పటివరకు 20 జట్లలో కొన్ని తమ స్క్వాడ్‌ను ప్రకటించాయి. ఆయా దేశాల స్క్వాడ్‌పై ఓ లుక్కేద్దాం. రిషబ్ పంత్ రీ ఎంట్రీ, టీ20 ప్రపంచకప్‌నకు భారత జట్టు ఇదిగో, కెప్టెన్‌గా రోహిత్ శర్మ, పేస్ భారం మోయనున్న బుమ్రా టీం
1. ఆఫ్ఘనిస్తాన్ స్క్వాడ్: రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ ఇషాక్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నాయబ్, కరీం జనత్, రషీద్ ఖాన్ (కెప్టెన్), నంగ్యాల్ ఖరోటీ, ముజీబ్ ఉర్ రహ్మాన్, నోవీన్ ఉర్ రహ్మాన్, హక్, ఫజల్హక్ ఫరూకీ, ఫరీద్ అహ్మద్ మాలిక్
రిజర్వ్ ఆటగాళ్లు: సెదిక్ అటల్, హజ్రతుల్లా జజాయ్, సలీమ్ సఫీ.
2. ఆస్ట్రేలియా జట్టు: ఆస్టన్ అగర్, ప్యాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కామెరూన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా.
3. ఇంగ్లండ్ జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), బెన్ డకెట్, ఫిల్ సాల్ట్, విల్ జాక్స్, జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కరన్, మోయిన్ అలీ, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, టామ్ హర్ట్లే, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, రీసే టాప్లే.
4. భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (కీపర్), సంజు శాంసన్ (కీపర్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్.
రిజర్వ్ ఆటగాళ్లు: శుభమాన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్.
5. న్యూజిలాండ్ స్క్వాడ్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, మైకెల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, లుకీ ఫెర్గుసన్, మ్యాట్ హెన్రీ, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, ఇష్ సోధీ, టిమ్ సౌథీ,
ట్రావెలింగ్ రిజర్వ్: బెన్ సీర్స్
6. దక్షిణాఫ్రికా జట్టు: ఐడెన్ మెక్‌క్రామ్ (కెప్టెన్), ఒటినెల్ బార్ట్‌మన్, గెరాల్డ్ కోట్జీ, క్వింటన్ డి కాక్, బైరాన్ ఫార్చ్యూన్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్, ఎన్రిక్యూ నార్కియా, తగిజ్‌బ్రాటన్, తగిజ్‌బ్రాటన్ షమ్సీ, ట్రిస్టన్ స్టబ్స్.
ట్రావెలింగ్ రిజర్వ్: బర్గర్, లుంగీ ఎంగిడి
ఇంకా బంగ్లాదేశ్, కెనడా, ఐర్లాండ్, నమిబీయా, నేపాల్, నెదర్లాండ్, ఒమాన్, పాకిస్థాన్, స్కాట్లాండ్, శ్రీలంక, ఉగాండా, అమెరికా, వెస్టిండీస్ తమ జట్లను ప్రకటించాల్సి ఉంది.
టీ20 ప్రపంచ కప్ 2024 గ్రూపులు
గ్రూప్ ఏ: ఇండియా, పాకిస్థాన్, ఐర్లాండ్, కెనడా, యూఎస్‌ఏ
గ్రూప్ బీ: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్
గ్రూప్ సీ: న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్, ఉగాండా, పాపువా న్యూ గినియా
గ్రూప్ డీ: దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్
టీ 20 ప్రపంచకప్‌లో టీమిండియా షెడ్యూల్
ఇండియా vs ఐర్లాండ్ - జూన్ 5 (న్యూయార్క్)
ఇండియా vs పాకిస్థాన్ - జూన్ 9 ( న్యూయార్క్)
ఇండియా vs యూఎస్‌ఏ - జూన్ 12 (న్యూయార్క్)
ఇండియా vs కెనడా - జూన్ 15 (ఫ్లోరిడా)