Virat Kohli Retirement Plan: రిటైర్మైంట్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన విరాట్ కోహ్లీ, కచ్ఛితంగా ఓ ముగింపు తేదీ అనేది ఉంటుందంటూ..
ఒక్కసారి తాను వీడ్కోలు పలికితే.. చాన్నాళ్ల పాటు తాను ఎవరికీ కనిపించనని తెలిపాడు.
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తన రిటైర్‌మెంట్‌పై ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశాడు.సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒక్కసారి తాను వీడ్కోలు పలికితే.. చాన్నాళ్ల పాటు తాను ఎవరికీ కనిపించనని తెలిపాడు. ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా తన కెరీర్‌ని ముగించాలని అనుకుంటున్నానని, ఆటలో కొనసాగేంతవరకు తన బెస్ట్ ఇవ్వాలని అనుకుంటున్నానని చెప్పుకొచ్చాడు.
స్పోర్ట్స్ పర్సన్‌గా కెరీర్‌కు కచ్ఛితంగా ఓ ముగింపు తేదీ అనేది ఉంటుంది. అందుకే.. నేను ఆటపై దృష్టి పెట్టి ముందుకు సాగిపోతున్నా. ఇప్పుడు‘అయ్యో ఫలానా రోజున అలా చేసి ఉంటే బాగుండేది’ అనే పశ్చాత్తాపంతో నా కెరీర్‌ని ముగించాలని అనుకోవడం లేదు. అలా ఆలోచిస్తూ ఉంటే మనం ఎప్పుడూ ముందుకు సాగలేం. నేను చేయలేకపోయిన దాని గురించి బాధపడుతూ ఉండను. 18 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో క్రికెటర్ కు ఊరట, తన తప్పు లేదని తేల్చిన హైకోర్టు, వరల్డ్ కప్ ముందు గుడ్ న్యూస్
అక్కడితోనే ఆ విషయాన్ని వదిలేసి, ఆ తర్వాత చేయగలిగే వాటి గురించే ఆలోచిస్తా’’ అని కోహ్లీ పేర్కొన్నాడు. ఇంకా మాట్లాడుతూ.. ‘‘క్రికెట్‌కు వీడ్కోలు పలికాక నేను చాన్నాళ్ల పాటు ఎవరికీ కనిపించను. సుదీర్ఘ విరామం తీసుకుంటా. కాబట్టి.. నేను క్రికెట్‌లో కొనసాగేంతకాలం అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని ప్రయత్నిస్తా. ఆ స్ఫూర్తే నన్ను నడిపిస్తోంది’’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం కోహ్లీ వయసు 35 సంవత్సరాలు. ఇప్పటికీ ఎంతో ఫిట్‌గా ఉన్న కోహ్లీ.. ఈమధ్య ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో (IPL 2024) 13 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ.. 155.16 స్ట్రైక్ రేట్, 66.10 సగటుతో 661 పరుగులు చేశాడు. టీ20 వరల్డ్‌కప్‌లో (T20 World Cup) కోహ్లీ కీలకపాత్ర పోషిస్తాడని అందరూ నమ్ముతున్నారు.