World Cup 2023: ఆస్ట్రేలియా మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ కు భారీ షాక్, వైరల్‌ ఫీవర్‌ బారీన పడిన కీలక ఆలగాళ్లు, కోవిడ్‌ రిపోర్ట్ ఏంటంటే..

వన్డే ప్రపంచకప్‌-2023లో టీమిండియా చేతిలో ఘోర ఓటమిని మూటగట్టుకున్న పాకిస్తాన్‌ ఆస్ట్రేలియాతో మరో కీలక పోరుకు రెడీ అవుతోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా అక్టోబర్‌ 20న బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌ కోసం ఇప్పటికే బెంగళూరుకు పాక్‌ జట్టు చేరుకుంది.

Pakistan Cricket Team (photo credits: @mufaddal_vohra/Twtter)

వన్డే ప్రపంచకప్‌-2023లో టీమిండియా చేతిలో ఘోర ఓటమిని మూటగట్టుకున్న పాకిస్తాన్‌ ఆస్ట్రేలియాతో మరో కీలక పోరుకు రెడీ అవుతోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా అక్టోబర్‌ 20న బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌ కోసం ఇప్పటికే బెంగళూరుకు పాక్‌ జట్టు చేరుకుంది. అయితే ఆదివారం బెంగళూరుకు చేరుకున్న పాక్‌ జట్టు ఇప్పటివరకు ప్రాక్టీస్‌ సెషన్స్‌లో మాత్రం పాల్గోనలేదు.

దీనికి కారణం పాక్‌ జట్టులో నలుగురు, ఐదుగురు ఆటగాళ్లు వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్నారు. వారిలో షాహీన్ అఫ్రిది, అబ్దుల్లా షఫీక్, జమాన్ ఖాన్, ఉసామా మీర్ వంటి స్టార్‌ ఆటగాళ్లు ఉన్నారు. ముందు జాగ్రత్తగా వీరికి వైద్య సిబ్బంది కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. నెగిటివ్‌గా తేలింది. అయితే ఆసీస్‌తో మ్యాచ్‌ సమయానికి వీరు కోలుకుంటారని ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు.

మహమ్మద్ రిజ్వాన్ మైదానంలో నమాజ్ వీడియో వీడియో ఇదిగో, క్రీడా స్ఫూర్తికి విరుద్ధమంటూ ఐసీసీకి ఫిర్యాదు చేసిన సుప్రీంకోర్టు న్యాయవాది వినీత్ జిందాల్

కాగా షెడ్యూల్‌ ప్రకారం పాకిస్తాన్‌ జట్టు చిన్నస్వామి స్టేడియంలో తమ తొలి ప్రాక్టీస్‌ పాల్గొనవలసింది. కానీ ఆటగాళ్లు అనారోగ్యంతో బాధపడుతున్నందన ప్రాక్టీస్‌ సెషన్స్‌ను సపోర్ట్‌ స్టాప్‌ నిర్వహించలేదు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పాకిస్తాన్‌ నాలుగో స్ధానంలో కొనసాగుతోంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement