పాకిస్థాన్ క్రికెటర్ మహమ్మద్ రిజ్వాన్ మైదానంలో నమాజ్ చేసిన వీడియోపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమంటూ సుప్రీంకోర్టు న్యాయవాది వినీత్ జిందాల్ ఆరోపించారు. దీనిపై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కు ఫిర్యాదు చేశారు. ప్రపంచకప్ 2023లో భాగంగా అక్టోబర్ 6న పాకిస్థాన్ జట్టు హైదరాబాద్ వేదికగా నెదర్లాండ్స్ తో తలపడింది. ఈ మ్యాచ్ సందర్భంగానే క్రికెట్ మైదానంలో రిజ్వాన్ నమాజ్ చేసినట్టు జిందాల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.భారత ప్రేక్షకుల ముందు, తన మతాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రదర్శించడం అన్నది క్రీడా స్ఫూర్తికి విరుద్ధం’’ అని నవీన్ జిందాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రిజ్వాన్ ఉద్దేశపూర్వక మత ప్రదర్శన క్రీడాస్ఫూర్తిని ఓడించే విధంగా ఉందన్నారు

మైదానంలో నమాజ్ చేయడమే కాకుండా, మ్యాచ్ అనంతరం విజయాన్ని గాజా ప్రజలకు అంకితం చేస్తున్నట్టు ప్రకటించడం తన మతపరమైన, రాజకీయ సిద్ధాంతాన్ని తెలియజేస్తోందన్నారు. శ్రీలంకపై తన విజయాన్ని గాజా ప్రజలకు అంకితం చేస్తున్నట్టు రిజ్వాన్ చేసిన ప్రకటన కూడా వివాదాస్పదం కావడం గమనార్హం. దీనికి ఇజ్రాయెల్ గట్టిగానే బదులిచ్చింది. పాకిస్థాన్ పై మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది. భారత్ చేతిలో ఓడిపోవడం ద్వారా తమ విజయాన్ని హమాస్ మిలిటెంట్లకు అంకింత చేసే అవకాశం లేకుండా పోయిందని ఎద్దేవా చేసింది.

Mohammad Rizwan Namaz

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)