India vs Bangladesh 1st Test: భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ టెస్టు సిరీస్, డీడీ స్పోర్ట్స్, డీడీ ఫ్రీ డిష్, దూరదర్శన్ నేషనల్ టీవీ ఛానెల్‌లో లైవ్ టెలికాస్ట్ ఉందా?
తొలి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది భారత్. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదకగా తొలి టెస్టు జరుగుతుండగా ఈ సిరీస్ అఫిషియల్ బ్రాడ్ కాస్టర్ స్పోర్ట్స్ 18.
Hyd, Sep 19: భారత్ బంగ్లాదేశ్ మధ్య టెస్టు సిరీస్ ఇవాళ్టి నుండి ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది భారత్. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదకగా తొలి టెస్టు జరుగుతుండగా ఈ సిరీస్ అఫిషియల్ బ్రాడ్ కాస్టర్ స్పోర్ట్స్ 18.
అయితే, IND vs BAN టెస్ట్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం దూరదర్శన్లో కూడా అందుబాటులో ఉంటుంది. DD ఉచిత డిష్ మరియు ఇతర DTT (డిజిటల్ టెరెస్ట్రియల్ టెలివిజన్) వినియోగదారులకు మాత్రమే. DD స్పోర్ట్స్లో IND vs BAN ప్రత్యక్ష ప్రసారం అందుబాటులో ఉంటుంది. కేబుల్ టీవీ లేదా ఎయిర్టెల్ డిజిటల్ టీవీ, టాటా ప్లే, డిష్ టీవీ వంటి డీటీహెచ్ ప్లాట్ ఫామ్‌లలో అందుబాటులో ఉండదు. హార్దిక్ పాండ్యాకు భారీ షాక్, ప్రపంచ నంబర్ వన్ టీ20 ఆల్‌రౌండర్‌గా లియామ్ లివింగ్‌స్టోన్, రెండో స్థానానికి పడిపోయిన మార్కస్ స్టోయినిస్
2023-25 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ల మధ్య టెస్టు సిరీస్ జరగనుంది. కొన్ని వారాల క్రితం పాకిస్థాన్‌తో జరిగిన సిరీస్‌ను బంగ్లా 2-0 తేడాతో గెలిచి వైట్ వాష్ చేసింది. దీంతో వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ రేసులోకి వచ్చేసింది బంగ్లాదేశ్. ఈ సిరీస్‌లో ఒకవేళ భారత్‌ను ఓడిస్తే ఖచ్చితంగా ఫైనల్ రేసులో ఉండే అవకాశం ఉంది.