Mohammed Shami–Sania Mirza: క్రికెటర్ మహ్మద్ షమీ, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వివాహం.. నిజమేనా?? అసలు విషయం ఏంటంటే?

అయితే, ఇవన్నీ పుకార్లేనని వారి అభిమానులు కొట్టిపారేశారు. అయితే,

Sania-Shami (Credits: Instagram)

Newdelhi, June 20: భారత క్రీడాకారిణి సానియా మీర్జా (Sania Mirza), భారత క్రికెటర్ మహ్మద్ షమీకి (Mohammed Shami) నిశ్చితార్ధం జరిగిందని ఇటీవలే వార్తలు హల్ చల్ చేశాయి. అయితే, ఇవన్నీ పుకార్లేనని వారి అభిమానులు కొట్టిపారేశారు. అయితే, తాజాగా వీరిద్దరికీ వివాహం జరిగినట్టు మరో వార్తా ప్రచారంలోకి వచ్చింది. అంతేకాదు వీళ్లు దండలు మార్చుకున్న ఫోటోలు కూడా నెట్ లో పెద్దయెత్తున వైరల్ గా మారాయి. పలువురు దీనిపై కామెంట్లు, పోస్టులు కూడా చేశారు. దీంతో ఇది నిజమేమోనని అందరూ భావించారు. అయితే, ఈ ఫోటోలు కూడా మార్ఫింగ్ చేసి ఎడిట్ చేసినవేనని తేలింది.  సానియా మీర్జా, షమీ వివాహం పుకారేనని అభిమానులు కూడా తేల్చి చెప్పారు. ఈ పుకార్లను సోషల్ మీడియా వ్యాప్తంగా కొట్టిపారేశారు.

Fan Shares Morphed Pic of Sania Mirza and Mohammed Shami Wedding

 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో భారీగా ఐఏఎస్ ల బ‌దిలీలు, అంతా అనుకున్న‌ట్లుగానే శ్రీ‌ల‌క్ష్మికి షాక్, గ‌త ప్ర‌భుత్వంలో కీల‌కంగా ఉన్న చాలా మందికి స్థాన‌చ‌లనం

అలా పుకార్లు మొదలు

ఇటు సానియా మీర్జా, అటు షమీ వ్యక్తిగత జీవింతో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సానియా భర్త, పాకిస్థానీ క్రికెటర్ షోయబ్ మాలిక్, నటి సనా జావేద్‌ తో తన మూడో పెళ్లిని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో షోయబ్ మాలిక్ తో విడాకులు తీసుకున్నట్లు సానియా ప్రకటించింది. ఇక 2018లో, షమీ తన మాజీ భార్య హసిన్ జహాన్ గృహ హింసకు పాల్పడ్డాడని ఆరోపించడంతో న్యాయ పోరాటానికి దిగాడు. ఈ భారత క్రికెటర్‌ కు అందరూ మద్దతు తెలిపారు. ఒంటరైన ఈ ఇద్దరు స్టార్ల పట్ల అందరూ సానుభూతి వ్యక్తం చేశారు. అయితే, తమ అభిమాన ఆటగాళ్లపై తాజాగా పుకార్లు, నిరాధారమైన సమాచారం వ్యాప్తి చెందడంపై అభిమానులు నిరాశను వ్యక్తం చేశారు. ఇద్దరు క్రీడాకారుల గోప్యతను గౌరవించాలని సూచించారు.

డిప్యూటీ సీఎంగా తొలిరోజే తన మార్క్ చూయించిన పవన్ కళ్యాన్.. దాదాపు 10 గంటల పాటు సుదీర్ఘ సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన జనసేనాని.. అధికారులకు 3 మాసాల టార్గెట్ ఫిక్స్!



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif